Telugu Global
Andhra Pradesh

రజినీ కాంత్ 100% కరెక్ట్..స్టార్ యాక్టర్ కామెంట్స్ వైరల్

విజయవాడ సభలో రజినీ ఏం మాట్లాడారో.. అందుకు వైసీపీ నేతలు ఏ విధంగా స్పందించారో తనకు తెలియదు అంటూనే రజినీకాంత్ ఎప్పుడూ పర్ఫెక్ట్ గా ఉంటారని, ఆయన 100% రైట్ అని జగపతిబాబు మాట్లాడటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Rajinikanth speaks the truth, 100% correct – Jagapathi Babu
X

రజినీ కాంత్ 100% కరెక్ట్..స్టార్ యాక్టర్ కామెంట్స్ వైరల్

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు వైసీపీ -రజినీకాంత్ ఇష్యూ హాట్ హాట్ గా నడుస్తోంది. విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో రజినీ పాల్గొనడం.. ఆయన చంద్రబాబు పాలనను పొగడడం.. దానికి కౌంటర్ గా వైసీపీ మంత్రులు రజినీపై విమర్శల దాడి చేయడం జరిగింది. ఈ ఇష్యూకు ఎప్పటికప్పుడు బ్రేక్ పడుతుంది అనుకున్నప్పటికీ.. ఎవరో ఒకరు దీనిపై మాట్లాడుతుండటంతో హాట్ హాట్ గానే నడుస్తోంది. తాజాగా ఈ ఇష్యూపై ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం ఆయన గోపీచంద్ హీరోగా నటిస్తున్న రామబాణం అనే సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం ఆయన పాల్గొంటున్నారు. ఓ మీడియా సంస్థకు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా రజినీకాంత్ ను వైసీపీ మంత్రులు విమర్శించడంపై మీడియా జగపతిబాబును ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. విజయవాడ సభలో రజినీకాంత్ ఏం మాట్లాడారో.. అందుకు వైసీపీ మంత్రులు ఏ విధంగా స్పందించారో తనకు తెలియదని చెప్పారు.

ఈ ఇష్యూని పక్కన పెడితే రజినీకాంత్ ఎప్పుడు మాట్లాడినా చాలా చక్కగా మాట్లాడతారని చెప్పారు. ఆయన మాట్లాడే విధానం పర్ఫెక్ట్ గా ఉంటుందన్నారు. అలాగే ఆయన నిజాలు మాత్రమే మాట్లాడతారని పేర్కొన్నారు. రజినీకాంత్ 100% రైట్ అని జగపతిబాబు స్పష్టం చేశారు.

విజయవాడ సభలో రజినీ ఏం మాట్లాడారో.. అందుకు వైసీపీ నేతలు ఏ విధంగా స్పందించారో తనకు తెలియదు అంటూనే రజినీకాంత్ ఎప్పుడూ పర్ఫెక్ట్ గా ఉంటారని, ఆయన 100% రైట్ అని జగపతిబాబు మాట్లాడటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మరి జగపతిబాబు చేసిన కామెంట్స్ ని వైసీపీ నేతలు తేలిగ్గా తీసుకుంటారో.. లేకపోతే తమదైన స్టైల్లో స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. కాగా, కొన్నేళ్ల కిందట రజినీకాంత్ తో కలిసి జగపతిబాబు కథానాయకుడు అనే సినిమాలో నటించాడు. ఆయనతో కలిసి నటించడం తన అదృష్టం అని పలు వేదికలపై వెల్లడించాడు.

First Published:  3 May 2023 9:18 PM IST
Next Story