Telugu Global
Andhra Pradesh

అర్థమైందా రాజా..! అందులో అంత డెప్త్ ఉందా..?

“మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరు లేదు.. ఇవి రెండూ జరగని ఊరు లేదు.. మనం మన పని చేసుకుంటూ పోతూనే ఉండాలి.. అర్ధమయ్యిందా రాజా..” అంటూ తన స్టైల్ లో తమిళంలో పంచ్ డైలాగులు కొట్టారు రజినీకాంత్.

అర్థమైందా రాజా..! అందులో అంత డెప్త్ ఉందా..?
X

అర్థమైందా రాజా..! అందులో అంత డెప్త్ ఉందా..?

జైలర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవల జరిగిన ఫంక్షన్లో సూపర్ స్టార్ రజినీ కాంత్ డైలాగులు వైరల్ గా మారాయి. వాట్సప్ స్టేటస్ లో విపరీతంగా ఈ డైలాగులు సర్కులేట్ అవుతున్నాయి. రజినీ అభిమానులే కాదు, ఈ డైలాగులు బాగున్నాయనుకున్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు, వాట్సప్ లో స్టేటస్ గా పెట్టుకుంటున్నారు.

ఇంతకీ రజినీ ఏమన్నారు..?

“మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరు లేదు.. ఇవి రెండూ జరగని ఊరు లేదు.. మనం మన పని చేసుకుంటూ పోతూనే ఉండాలి.. అర్ధమయ్యిందా రాజా..” అంటూ తన స్టైల్ లో తమిళంలో పంచ్ డైలాగులు కొట్టారు రజినీకాంత్. జైలర్ సినిమాలో ఈ డైలాగులున్నాయా..? లేక ఆయన కావాలనే స్టేజ్ పై చెప్పారా అనేదానిపై క్లారిటీ లేదు.

వైసీపీ వాళ్లని టార్గెట్ చేశారా..?

ఆమధ్య ఎన్టీఆర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నుంచి కౌంటర్లు పడ్డాయి. కొడాలి నాని వంటి నేతలు రజినీకాంత్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలకు కౌంటర్ గానే రజినీ ఇప్పుడు నోరు విప్పారని, అర్థమైందా రాజా అంటూ.. చురకలంటించారని అంటున్నారు. కానీ దీనిపై ఎవరూ నేరుగా స్పందించడంలేదు. వైసీపీ నుంచి కూడా రియాక్షన్ లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎవరికి తోచినట్టు వారు వ్యాఖ్యానాలిస్తున్నారు. రజినీ డైలాగులు ఎవరిని ఉద్దేశించి చేసినవో తెలియదు కానీ, సినిమా డైలాగులకంటే ఎక్కువగా అవి పాపులర్ అవుతున్నాయి.

First Published:  9 Aug 2023 12:14 PM GMT
Next Story