Telugu Global
Andhra Pradesh

ఎల్లో మీడియా బ్రేకింగ్ న్యూస్: రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ సెలవు

ప్రస్తుత సూపరింటెండెంట్ రాహుల్ సెలవు పెట్టడంతో కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ కు ఇన్‌ ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఈ ఉత్తర్వులు ఇలా విడుదలయ్యాయో లేదో అలా బ్రేకింగ్ న్యూస్ పడిపోయింది.

ఎల్లో మీడియా బ్రేకింగ్ న్యూస్: రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ సెలవు
X

చంద్రబాబుకి రాజమండ్రి జైలులో ప్రాణ హాని అంటూ హడావిడి చేస్తున్నాాయి టీడీపీ శ్రేణులు. అంతకంటే ఎక్కువగా ఎల్లో మీడియా ఈ వార్తలతో ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తోంది. తాజాగా ఎల్లో బ్రేకింగ్ న్యూస్ ఒకటి బయటికొచ్చింది. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సెలవు పెట్టారట. ఆయన స్థానంలో కొత్తవారికి ఇన్ చార్జ్ బాధ్యతలు ఇచ్చారట. అయ్యయ్యో చంద్రబాబుని ఏదో చేసేస్తారు, జైలులో ఏదో అయిపోతోంది అంటూ గగ్గోలు మొదలైంది.

సెలవు పెట్టడం తప్పా..?

చంద్రబాబు జైలులో ఉంటే సిబ్బంది ఎవరూ సెలవు తీసుకోకూడదా..? అందరూ చంద్రబాబు చుట్టూ పహారా కాయాలా..? జైలుని జైలుగా కాకుండా చంద్రబాబు ఇంటిలా అలంకరించాలి, అన్నీ ఆయన టేబుల్ దగ్గరకే సమకూర్చాలి అంటే ఎలా..? జైలులో ఉన్నది మాజీ ముఖ్యమంత్రే కావొచ్చు, ఆయనొక రిమాండ్ ఖైదీ. దానికి తగ్గట్టే జైలులో ట్రీట్ మెంట్ ఉంటుంది. మరి ఈ విషయంలో ఎల్లో మీడియా రాద్ధాంతం దేనికో అర్థం కావట్లేదు. పోనీ సూపరింటెండెంట్ అనుమానాస్పద రీతిలో సెలవు పెట్టారా అంటే అదీ లేదు. ఆయన భార్య అనారోగ్యం కారణంగా సెలవు పెట్టారు. వారి కుటుంబం ప్రస్తుతం ఆఫీసర్స్ క్వార్టర్స్ లోనే ఉంటోంది. అనారోగ్యం కారణంగా ఆయన భార్యను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అందుకే ఆయన సెలవు పెట్టారు. కానీ ఇక్కడ ఏదో జరిగిపోతోందంటూ ఎల్లో మీడియా రచ్చ చేస్తోంది.

ప్రస్తుత సూపరింటెండెంట్ రాహుల్ సెలవు పెట్టడంతో కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ కు ఇన్‌ ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఈ ఉత్తర్వులు ఇలా విడుదలయ్యాయో లేదో అలా బ్రేకింగ్ న్యూస్ పడిపోయింది. చంద్రబాబు భద్రతపై కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని, కానీ ఎవరూ పట్టించుకోవట్లేదని, ఈలోగా జైలు సూపరింటెండెంట్ సెలవు పెట్టడం చర్చనీయాంశమైందని అంటున్నారు.

First Published:  14 Sept 2023 7:28 PM IST
Next Story