Telugu Global
Andhra Pradesh

రాజమండ్రి జైలులో చీమ చిటుక్కుమన్నా వార్తే..

రాజమండ్రి సెంట్రల్ జైలు ఇప్పుడు టాక్ ఆధ్ ది స్టేట్ గా మారింది. ఆ జైలులో ఏం జరిగినా ఏపీలో సంచలనమే. ఎందుకంటే అక్కడ చంద్రబాబు ఉన్నారు. ఆయన జైలుకెళ్లిన తర్వాత ఎల్లో మీడియా ప్రతి చిన్న విషయాన్ని హైలైట్ చేస్తూ ఎగిరెగిరి పడుతోంది.

రాజమండ్రి జైలులో చీమ చిటుక్కుమన్నా వార్తే..
X

జైలులో ఖైదీలంతా క్రమశిక్షణతో ఉంటారని, అందరూ సత్ప్రవర్తనతో మెలుగుతారని అనుకోలేం. ఆ మాటకొస్తే జైలుకెళ్లారంటే ఎంతో కొంత దుందుడుకు స్వభావం ఉన్నవారే అనుకోవాలి. రాజమండ్రి జైలు కూడా దానికి మినహాయింపేమీ కాదు. అయితే సెప్టెంబర్ -25న రాజమండ్రి జైలులో జరిగిన ఓ ఘటనను ఇప్పుడు ఎల్లో మీడియా హైలైట్ చేస్తోంది. ఖైదీలమధ్య తోపులాట జరిగిందని, రిమాండ్ ఖైదీ గాయపడ్డారని, ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసిందంటూ ఈనాడు ఓ కథనం రాసుకొచ్చింది.

టాప్ ఆఫ్ ది స్టేట్.. సెంట్రల్ జైల్

రాజమండ్రి సెంట్రల్ జైలు ఇప్పుడు టాక్ ఆధ్ ది స్టేట్ గా మారింది. ఆ జైలులో ఏం జరిగినా ఏపీలో సంచలనమే. ఎందుకంటే అక్కడ చంద్రబాబు ఉన్నారు. ఆయన జైలుకెళ్లిన తర్వాత ఎల్లో మీడియా ప్రతి చిన్న విషయాన్ని హైలైట్ చేస్తూ ఎగిరెగిరి పడుతోంది. భార్యను ఆస్పత్రి తీసుకెళ్లేందుకు సూపరింటెండెంట్ సెలవు పెట్టినా.. రాద్ధాంతం చేసింది. జైలులో ఉన్న ఖైదీ అనారోగ్యంతో మరణిస్తే.. డెంగీతో చనిపోయాడని, జైలులో ఖైదీల ప్రాణాలకు రక్షణ లేదని కథనాలిచ్చింది. తాజాగా రిమాండ్ ఖైదీ దవడ పగిలిందని, ఈ ఘటనను జైలు అధికారులు గోప్యంగా ఉంచారని, ఆలస్యంగా అది వెలుగు చూసిందని ఈనాడు రాద్ధాంతం చేస్తోంది.

తోపులాటలో గాయపడిన ఖైదీని కాకినాడ ఆస్పత్రికి తరలించారనేది ఈనాడు కథనం. కానీ పొరపాటున కాలుజారి కిందపడటంతో గాయమైందనేది జైలు అధికారుల సమాచారం. ఆపరేషన్ చేసే వైద్యులు అందుబాటులో లేకపోవడంతో తిరిగి జైలుకి తీసుకొచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనను చంద్రబాబు భద్రతకు ముడి పెడుతూ ఈనాడు వ్యవహారం నడిపింది. జైలులో చంద్రబాబుకి సరైన భద్రత లేదని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేయడాన్ని ఈనాడు హైలైట్ చేసింది. ఇక జైలులో చంద్రబాబుని దోమలతో కుట్టించి ప్రభుత్వం హాని తలపెడుతోందని గతంలో టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. చంద్రబాబు బెయిల్ పిటిషన్లన్నీ రద్దుకావడంతో.. ఆయన జైలులోనే ఉండాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడటంతో.. ఎల్లో మీడియా జైలులో భద్రత కరువంటూ కథనాలు వండి వారుస్తోంది.

First Published:  10 Oct 2023 7:39 AM IST
Next Story