Telugu Global
Andhra Pradesh

రఘురామ కృష్ణంరాజు రెంటికి చెడ్డ రేవడే..?

కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవికి నర్సాపురం టికెట్‌ కేటాయించాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర నాయకత్వానికి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.

రఘురామ కృష్ణంరాజు రెంటికి చెడ్డ రేవడే..?
X

ర‌ఘురామకృష్ణంరాజు పరిస్థితి కుడితో పడిన ఎలుకలా తయారైంది. ఇన్నాళ్లూ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై బుర‌ద‌జ‌ల్లి టీడీపీ-జ‌న‌సేన కూట‌మికి ద‌గ్గ‌రైన ఆయ‌న‌కు నర్సాపురం నుంచి కూట‌మి త‌ర‌ఫున‌ టికెట్‌ కేటాయించే అవకాశాలు లేవని తెలుస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ గుర్తుపై గెలిచిన రఘురామకృష్ణంరాజు ఆ పార్టీపై తిరుగుబాటు జెండా ఎగ‌రేశారు. ఈ క్ర‌మంలోనే టీడీపీకి ద‌గ్గ‌ర‌య్యారు.

నర్సాపురం నుంచి టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన చెప్పారు. ఆయన ఈ రెండు పార్టీల్లో దేంట్లోనూ చేరలేదు. టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరుతున్న పరిస్థితిలో ఆయన బీజేపీలో చేరడానికి సిద్ధపడినట్లు సమాచారం.

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ బీజేపీతో సీట్ల పంపకంపై చర్చలు జరుపుతున్నారు. సీట్ల పంపకంలో నర్సాపురం సీటును బీజేపీకి కేటాయించే అవకాశాలున్నాయి. అయితే నర్సాపురం టికెట్‌ను రఘురామ కృష్ణంరాజుకు ఇవ్వడానికి బీజేపీ ఇష్టప‌డ‌టం లేదని సమాచారం. కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవికి నర్సాపురం టికెట్‌ కేటాయించాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర నాయకత్వానికి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.

శ్యామలాదేవికి ఆ సీటు కేటాయించని పక్షంలో భూపతిరాజు శ్రీనివాస వర్మను పోటీకి దించాలని బీజేపీ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఆయన గతంలో నర్సాపురం నుంచి వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి గెలిచారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో నర్సాపురం టికెట్‌ రఘురామకృష్ణమ రాజుకు దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. విజయవాడ నుంచి ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్‌ను, రాజమండ్రి నుంచి పురందేశ్వరిని బీజేపీ పోటీలో నిలిపే అవకాశాలున్నాయి.

First Published:  9 March 2024 12:49 PM IST
Next Story