మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ!
పదవ తరగతి పరీక్షలో ప్రశ్నా పత్రం లీకు చేయడంలో నారాయణ విద్యా సంస్థ అధిపతి, మాజీ మంత్రి నారయణ, ఆ సంస్థ సిబ్బంది పాత్ర ఉందని ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ (ఎఎజి) ప్రభాకర రెడ్డి కోర్టు కు వివరించారు. ఈ చర్యలతో విద్యార్ధుల జీవితాలతో ఆడుకున్నారని ఆయన వివరించారు. ఇటువంటి నేరాల పట్ల మొతక వైఖరి చూపద్దని కోర్టును కోరారు.
పదవ తరగతి పరీక్ష ప్రశ్నా పత్రం లీకు కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వం దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ కు విచారణ అర్హత లేదంటూ నారాయణ తరపు న్యాయవాది చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే నారాయణ బెయిల్ రద్దు చేసిన సెషన్స్ కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ ఈ కేసు పూర్వాపరాలు ఆధారంగా కేసును తిరిగి విచారించాలని సెషన్స్ కోర్టును ఆదేశించింది.
పదవ తరగతి పరీక్షలో ప్రశ్నా పత్రం లీకు చేయడంలో నారాయణ విద్యా సంస్థ అధిపతి, మాజీ మంత్రి నారయణ, ఆ సంస్థ సిబ్బంది పాత్ర ఉందని ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ (ఎఎజి) ప్రభాకర రెడ్డి కోర్టు కు వివరించారు. ఈ చర్యలతో విద్యార్ధుల జీవితాలతో ఆడుకున్నారని ఆయన వివరించారు. ఇటువంటి నేరాల పట్ల మొతక వైఖరి చూపద్దని కోర్టును కోరారు.
తీవ్ర మైన ఈ నేరం విషయంలో మేజిస్ట్రేట్ కోర్టు మినీ ట్రయిల్ నిర్వహించిందని అన్నారు. ఈ కేసులో నిందితుడికి రిమాండు రద్దు చేస్తూ బెయిల్ మంజూరు చేయడం ద్వారా మేజిస్ట్రేట్ పరిధిని దాటారని కూడా ఎఎజి కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ఈ ఉత్తర్వులను సెషన్స్ కోర్టు కొట్టేస్తూ బెయిల్ రద్దు చేసింది.
దీనిపై నారాయణ క్వాష్ పటిషన్ దాఖలు చేస్తూ సెషన్స్ కోర్టు ఉత్తర్వులను కొట్టేయాలని కోరిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ కు విచారణార్హత లేదన్న నారాయణ తరపు లాయర్ వాదనను హైకోర్టు తోసిపుచ్చుతూ తిరిగి కేసును విచారించాలని సెషన్స్ కోర్టును ఆదేశించింది.