నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పుట్టా పేరు?
టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు. యనమల రామకృష్ణుడికి స్వయాన అల్లుడు పుట్టా మహేష్ యాదవ్. ఎలాగైనా నరసరావుపేట నుంచి పుట్టా మహేష్‌ను ఎంపీ అభ్యర్థిగా నిలిపేందుకు సుధాకర్ యాదవ్, యనమల పావులు కదుపుతున్నారు.
నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీ కోసం టీడీపీలో అభ్యర్థుల వేట మొదలైంది. రాయపాటి సాంబశివరావు వయసు పైబడటంతో ఆయన స్థానంలో ఈసారి కొత్త అభ్యర్థి పేరు తెరపైకి వస్తోంది. నరసరావుపేట నుంచి కడప జిల్లాకు చెందిన పుట్టా మహేష్ యాదవ్ పోటీలో ఉంటారని వినిపిస్తోంది. ఈయన టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు. యనమల రామకృష్ణుడికి స్వయాన అల్లుడు. ఎలాగైనా నరసరావుపేట నుంచి పుట్టా మహేష్‌ను ఎంపీ అభ్యర్థిగా నిలిపేందుకు సుధాకర్ యాదవ్, యనమల పావులు కదుపుతున్నారు.
బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడిని కలిసి తాను నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నట్టు మహేష్ యాదవ్ వివరించారు. చంద్రబాబునాయుడిని ఒప్పించాల్సిందిగా కోరారు. అల్లుడు తరపున యనమల రామకృష్ణుడు కూడా లాబీయింగ్ చేస్తున్నారు. కుమారుడికి ఎంపీ టికెట్ ఇస్తే తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు టికెట్‌ను త్యాగం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. అయితే టీడీపీకి బలమైన మద్దతుదారుగా ఉంటే ఒక సామాజికవర్గం బలంగా ఉన్న ప్రాంతంలో పుట్టా మహేష్ యాదవ్‌కు టికెట్ దక్కుతుందా అన్నది చూడాలి.