Telugu Global
Andhra Pradesh

చిన్నమ్మ అలక.. పొత్తులో లుకలుకలు..?

కేంద్రమంత్రి, కేంద్ర పెద్దలు వచ్చినప్పుడు ప్రోటోకాల్‌లో భాగంగా వెంట ఉండాల్సిన పురందేశ్వరి ఎందుకు రాలేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

చిన్నమ్మ అలక.. పొత్తులో లుకలుకలు..?
X

ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీట్ల పంపకాలపై మూడు పార్టీల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు బైజయంత్ పాండా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ భేటీకి హాజరయ్యారు.

అయితే.. ఏపీ పొత్తుల్లో లుకలుకలు బయటపడుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ నేతల కీలక సమావేశానికి ఏపీ బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి దూరంగా ఉన్నారు. పొత్తులో భాగంగా అభ్యర్థులు, సీట్ల సర్దుబాటుపై జరుగుతున్న సమావేశానికి.. రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి హాజ‌రు కాక‌పోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నివాసానికి పురందేశ్వరి రాకపోవడంపై బీజేపీ నేతలు సైతం స్పష్టత ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది.

కేంద్రమంత్రి, కేంద్ర పెద్దలు వచ్చినప్పుడు ప్రోటోకాల్‌లో భాగంగా వెంట ఉండాల్సిన పురందేశ్వరి ఎందుకు రాలేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ- బీజేపీ పొత్తు కోసం తీవ్రంగా ప్రయత్నించిన పురందేశ్వరి.. తీరా పొత్తు కుదిరిన తర్వాత ఎందుకు దూరంగా ఉన్నారని సందేహం కలుగుతోంది. టీడీపీ-జనసేన- బీజేపీ పొత్తులో అసలు ఏం జరుగుతోంది? పురందేశ్వరి ఎందుకు రాలేదు? కావాలనే రాలేదా? లేదంటే ఏదైనా విషయంలో అలిగారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

First Published:  11 March 2024 11:17 AM GMT
Next Story