Telugu Global
Andhra Pradesh

భద్రత కల్పించండి.. కడప ఎస్పీని కోరిన దస్తగిరి

వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అప్రూవర్ గా మారిన డ్రైవర్ దస్తగిరి తనకు ప్రాణహాని ఉందని భద్రత పెంచాలని కోరారు.

భద్రత కల్పించండి.. కడప ఎస్పీని కోరిన దస్తగిరి
X

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌ను కలిసి తనకు ప్రాణహాని ఉందని భద్రత పెంచాలని కోరారు. వైసీపీ నేతల నుంచి తనకు ముప్పు ఉందని ఎస్పీ తెలిపారు. గతం ప్రభుత్వం తనకు ఉన్న భద్రతను తగ్గించారని దస్తగిరి పేర్కొన్నారు. ఏపీ శాసన సభలో కూడా ఈ విషయం చర్చకు వచ్చిందని, సాక్షుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నాడు. గతంలో కడప జైలులో డాక్టర్ చైతన్యరెడ్డి తనను బెదిరించారని కూడా దస్తగిరి తన వినతిపత్రంలో వివరించాడు.

కూటమి ప్రభుత్వం తనకు భద్రత కల్పిస్తుందని భావిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశాడు. గతంలో ఉన్న భద్రతనే ఇప్పుడూ కొనసాగించాలని కోరాడు. మూడు రోజుల కిందట వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగన్న మృతిపై ఆయన భార్య సుశీలమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరేళ్లలో అనుమానాస్పదంగా మరణించిన సాక్షుల వివరాలను సిట్ లోతుగా విచారించనుంది.

First Published:  12 March 2025 3:53 PM IST
Next Story