ఏపీలో పాత విధానంలోనూ ఆస్తుల రిజిస్ట్రేషన్.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఆప్షనలే
నూతన విధానంపై డాక్యుమెంట్ రైటర్లు, స్థిరాస్తి వ్యాపారులు సహా ప్రజల నుంచి పెద్దఎత్తున ఆందోళనలు, అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ పాత విధానంలోనూ కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఆప్షనల్‌గా మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. నూతన విధానంపై డాక్యుమెంట్ రైటర్లు, స్థిరాస్తి వ్యాపారులు సహా ప్రజల నుంచి పెద్దఎత్తున ఆందోళనలు, అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
గందరగోళంగా ఉందన్న బిల్డర్లు
పాత రిజిస్ట్రేషన్ విధానమే సౌకర్యంగా ఉందని బిల్డర్లు, ప్రజలు చెప్తున్నారు. ఈరోజు విజయవాడలో రియల్ ఎస్టేట్ సంఘాల సమావేశానికి హాజరైన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ ముందు ఇదే చెప్పారు. థర్డ్ పార్టీ సహకారం లేకుండా రిజిస్ట్రేషన్ చేస్కునే టెక్నికల్ నాలెడ్జి అందరికీ ఉండదన్నారు.
రెండు విధానాలూ ఉంచుతాం
ఐజీ రామకృష్ణ మాట్లాడుతూ.. పాత, కొత్త రెండు విధానాల్లోనూ రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. కొత్త విధానం కేవలం ఆప్షన్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు.