అవినాశ్‌కు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఫుల్ సపోర్ట్
వివేకా హత్యకేసులో సీబీఐ ఒకే కోణంలో దర్యాప్తు చేస్తోందని మండిపడ్డారు. వైఎస్ వివేకాకు రెండో భార్య ఉందని, కొందరు టీడీపీ నేతలతో విబేధాలు ఉన్నాయని, ఆ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ఆయన ప్రశ్నిస్తున్నారు.
వివేకా హత్యకేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామంతో వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాయి. ఆ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ ఈ విషయం మీద పెద్దగా స్పందించడం లేదు. మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియా ముందుకొచ్చి .. చట్టం తన పని తాను చేసుకుపోతున్నదని రొటీన్ డైలాగ్ చెప్పారు.
ఇక వైసీపీకి చెందిన కీలక నేతలు, ముఖ్యంగా ఆ పార్టీ తరఫున బలమైన వాయిస్ వినిపించే సజ్జల సైతం స్పందించలేదు. అయితే ఈ కేసుకు సంబంధించి.. అవినాశ్ రెడ్డి సీబీఐ తీరును తప్పుపట్టారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అవినాశ్ రెడ్డికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అండగా నిలబడ్డారు. సీబీఐ తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
వివేకా హత్యకేసులో సీబీఐ ఒకే కోణంలో దర్యాప్తు చేస్తోందని మండిపడ్డారు. వైఎస్ వివేకాకు రెండో భార్య ఉందని, కొందరు టీడీపీ నేతలతో విబేధాలు ఉన్నాయని, ఆ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. గతంలో వివేకా కూతురు సునీత తండ్రి హత్య కేసు విషయంలో టీడీపీ నేతల మీద ఆరోపణలు చేశారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారని ప్రశ్నించారు. మొత్తంగా ఈ వ్యవహారంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాత్రమే మాట్లాడటం గమనార్హం. భాస్కర్ రెడ్డి అరెస్ట్ వ్యవహారం నిన్న ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అన్ని చానళ్లలో ఇదే చర్చ సాగింది.