రాష్ట్రం గెలవడమేంటి.. ఏంటీ వింత లాజిక్..?
నిజంగానే ఏపీ అవమాన భారంతో కుంగిపోతోందంటే అందుకు చంద్రబాబు కూడా కారణమన్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు విషయానికి వస్తే.. రాష్ట్రానికి పూర్వవైభవం రావాలంటే రాబోయే ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలనే లాజిక్ బయటపెట్టింది.
టీడీపీ అనుకూల మీడియా ఆదివారం ఒక వింత లాజిక్ బయటపెట్టింది. అదేమిటంటే.. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలట. ఆంధ్రప్రదేశ్ అవమానభారం నుంచి బయటపడి గర్వంగా తలెత్తుకుని బతకాలంటే రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కాకుండా రాష్ట్రం గెలవాలని పిలిపివ్వటమే విచిత్రంగా ఉంది. ఎల్లోమీడియా బాధపడినట్లు ఇప్పుడు ఏపీ ఏమీ అవమాన భారంతో కుంగిపోవటంలేదు. జగన్ అధికారంలో ఉండటాన్ని సహించలేకపోతున్న టీడీపీ అనుకూల మీడియానే తప్పుడు రాతలు రాస్తూ రాష్ట్రం పరువు తీసేస్తోంది.
నిజంగానే ఏపీ అవమాన భారంతో కుంగిపోతోందంటే అందుకు చంద్రబాబు కూడా కారణమన్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు విషయానికి వస్తే.. రాష్ట్రానికి పూర్వవైభవం రావాలంటే రాబోయే ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలనే లాజిక్ బయటపెట్టింది. అధికారాన్ని ఎవరికి అప్పగిస్తే తాము సగర్వంగా తలెత్తుకు బతకగలమో జనాలు ఆలోచించుకోవాలట. ఎల్లోమీడియా ఉద్దేశమేమో చంద్రబాబు గెలవాలనే. జనాలు టీడీపీని గెలిపించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం గెలిచినట్లు, జనాలు తలెత్తుకుని బతకగలరని.
కానీ, ఎందుకనో ఆ విషయాన్ని డైరెక్టుగా చెప్పలేకపోయింది. అంటే టీడీపీ గెలుపుపై ఎల్లోమీడియాలోనే నమ్మకంలేదని అర్థమవుతోంది. రేపటి ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలిస్తే జనాలు తప్పుచేశారని ఎల్లోమీడియా గోలచేయటం ఖాయం. నిజానికి ఎన్నికల్లో రాష్ట్రం గెలవటం, ఓడటం అన్నది ఉండదు. గెలుపు, ఓటమి రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు మాత్రమే ఉంటుంది. అయినా రాష్ట్రం గెలవాలని వింత లాజిక్ లేవదీశారంటే టీడీపీ గెలుస్తుందనే నమ్మకం లేనట్లుంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమనే నమ్మకం ఏమాత్రమున్నా ఎల్లోమీడియా రాతలు మరోరకంగా ఉండేవి.
ఇక కొంతమంది అధికారులను ఎల్లోమీడియా గంగిరెద్దులతో పోల్చింది. ఎందుకంటే.. జగన్ ఏదిచెబితే అధికారులు దాన్ని తూచా తప్పకుండా చేస్తున్నారట. మరి చంద్రబాబు అధికారంలో ఉండగా అధికారులు ఏమిచేశారు..? అధికారంలో ఎవరున్నా చెప్పింది చేయటానికే చాలామంది అధికారులు అలవాటు పడిపోయారు. ఈ పద్ధతికి చంద్రబాబని లేదు జగన్ అనిలేదు. ఐఏఎస్, ఐపీఎస్‌లు కీలకమైన పోస్టింగులను ఆశిస్తున్నంత కాలం ఈ పద్ధతి మారదని అందరికీ తెలుసు. చంద్రబాబు హయాంలో అధికార యంత్రాంగం సొంత ఆలోచనలతో పనిచేసినట్లుగా ఎల్లోమీడియా కలరింగ్ ఇవ్వటమే విచిత్రంగా ఉంది.