ములాఖత్‌పై ఏంటీ మొండి పంచాయితీ?
అన్యాయంగా అరెస్టు చేసి, జైల్లో వేశారు, ములాఖత్‌కూ అవకాశం ఇవ్వరా అంటూ చంద్రబాబు భార్య నిన్న కామెంట్ చేశారు. అయితే నిబంధనల ప్రకారమే తాము ములాఖత్ అర్జీని తిరస్కరించామని జైలు అధికారులు అంటున్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును కలిసేందుకు తమకు అవకాశం ఇవ్వలేదంటూ ఆయన భార్య భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరలవుతున్నాయి. అన్యాయంగా అరెస్టు చేసి, జైల్లో వేశారు, ములాఖత్‌కూ అవకాశం ఇవ్వరా అంటూ చంద్రబాబు భార్య నిన్న కామెంట్ చేశారు. అయితే నిబంధనల ప్రకారమే తాము ములాఖత్ అర్జీని తిరస్కరించామని జైలు అధికారులు అంటున్నారు.
వారానికి రెండుసార్లే.. మూడోసారి కావాలంటూ పట్టు
జైలు నిబంధనల ప్రకారం ఒక రిమాండ్ ఖైదీకి వారానికి రెండుసార్లే ములాఖత్ అవకాశం కల్పిస్తారు. అదీ ఒక్కసారికి ముగ్గురు సభ్యులే వెళ్లాలి. ఆల్రెడీ ఈ వారంలో ఒకసారి చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి ములాఖత్ అయ్యారు. రెండు రోజుల కిందట పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణ కలిసి రెండోసారి ములాఖత్ అయ్యారు. అంటే రెండు ములాఖత్‌లు అయిపోయాయి. కానీ భువనేశ్వరి శుక్రవారం మూడోసారి ములాఖత్‌కు దరఖాస్తు చేశారు. అది తిరస్కరణకు గురయింది.
కనీసం కారణమైనా చెప్పలేదట!
ములాఖత్‌కూ అవకాశం ఇవ్వరా అని భువనేశ్వరి కామెంట్ చేసిన నేపథ్యంలో .. మూడోసారి ములాఖత్ కావాలంటే అప్లికేషన్‌లో కచ్చితంగా కారణం చెప్పాలని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. భువనేశ్వరి అప్లికేషన్‌లో అందుకు కారణమేంటో చెప్పలేదని, అందువల్లే రూల్స్ ప్రకారం దాన్నితిరస్కరించామని స్పష్టత ఇచ్చారు. రూల్స్ ప్రకారం ఒక వారంలో మూడోసారి ములాఖత్ కుదదరని తెలిసినా కావాలనే దీన్ని రచ్చ చేస్తున్నారని వైసీపీ కామెంట్ చేస్తోంది.
♦