Telugu Global
Andhra Pradesh

పీకే సంచలన వ్యాఖ్యలు.. వైసీపీ కౌంటర్లు

అప్పటికప్పుడు టీడీపీకోసం పనిచేయబోనని చెప్పినా.. ఇప్పుడిలా మీడియా ముందు వైసీపీపై విషం చిమ్మేందుకే పీకే ప్యాకేజీ తీసుకుని ఉంటాడని అంటున్నారు.

పీకే సంచలన వ్యాఖ్యలు.. వైసీపీ కౌంటర్లు
X

ఏపీలో రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు దూరంగా ఉన్న ప్రశాంత్ కిషోర్ తాజాగా ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సర్వేలన్నీ వైసీపీదే ఘన విజయం అని చెబుతున్న సందర్భంలో పీకే మాత్రం జగన్ కి ఓటమి తప్పదంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. హైదరాబాద్ లో ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎల్లో మీడియా ఎగిరిగంతేసే వార్త చెప్పడంతో అది నిమిషాల్లో వైరల్ గా మారింది. అయితే ఆ తర్వాత వైసీపీ నుంచి ఓ రేంజ్ లో కౌంటర్లు మొదలయ్యాయి. మంత్రి అంబటి రాంబాబు ముందుగా పీకేకి జవాబిచ్చారు.

అప్పట్లో ఆంధ్రా ఆక్టోపస్ గా పేరున్న లగడపాటి కూడా సర్వేలంటూ కొన్నాళ్లు కాలక్షేపం చేసి తర్వాత సన్యాసం తీసుకున్నాడని, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా సన్యాసం తీసుకోడానికి సిద్ధంగా ఉన్నాడని అన్నారు మంత్రి అంబటి. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యల్ని ఆయన ట్విట్టర్ వేదికగా ఖండించారు. ఏపీలో వైసీపీ విజయం ఖాయమని తేల్చి చెప్పారు.

బాబుకోసమేనా..?

ఆమధ్య ప్రశాంత్ కిషోర్, చంద్రబాబు భేటీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ తరపున ఆయన వ్యూహకర్తగా పనిచేస్తారేమో అనుకున్నారంతా. కానీ ఏపీలో తాను ఏ పార్టీకోసం పనిచేయనంటూ అప్పట్లోనే తేల్చి చెప్పారు పీకే. అక్కడితో ఆ ఎపిసోడ్ ముగిసిపోలేదు. బాబుతో పీకే భేటీ రిజల్ట్ ఏంటో ఇప్పుడే జనాలకు తెలిసింది. అప్పటికప్పుడు టీడీపీకోసం పనిచేయబోనని చెప్పినా.. ఇప్పుడిలా మీడియా ముందు వైసీపీపై విషం చిమ్మేందుకే పీకే ప్యాకేజీ తీసుకుని ఉంటాడని అంటున్నారు. అందుకే వైసీపీ పరాజయం అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు, ఎల్లోమీడియా దాన్ని హైలైట్ చేస్తోంది. అయితే పీకే గతంలో ఇచ్చిన సర్వే రిపోర్ట్ లతో వైసీపీ కూడా కౌంటర్లు రెడీ చేసింది. ఇటీవల వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ విషయంలో పీకే అంచనాలు తలకిందులయ్యాయని ఉదాహరణలు చూపిస్తున్నారు వైసీపీ నేతలు. ఆయన చంద్రబాబు ఏజెంట్ అని ఆరోపిస్తున్నారు.

First Published:  4 March 2024 8:00 AM IST
Next Story