ATM వ్యాన్‌లో డబ్బు దోచేసి.. చెట్టు తొర్రలో దాచేసి.. ప్రకాశం జిల్లాలో ఘటన
మొత్తం సొమ్ములో నుంచి రూ. 66 లక్షలు చోరీకి గురైనట్లు గుర్తించిన CMS సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి.. ముసుగు ధరించిన వ్యక్తి బైక్ పై వచ్చి.. వాహనంలోని నగదు తీసుకుళ్తున్నట్లు గుర్తించారు.
ఏటీఎంలలో డబ్బు నింపే CMS వెహికిల్ నుంచి రూ. 64 లక్షలు దొంగతనం చేసిన ఓ వ్యక్తి.. ఆ నగదు మొత్తాన్ని ఓ చెట్టు తొర్రలో దాచిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. నిందితుడిని గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు నగదు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
CMS సెక్యూరిటీ సంస్థ సిబ్బంది చీమకుర్తి, మర్రిచెట్లపాలెం, దొడ్డవరం, గుండ్లాపల్లి, మద్దిపాడు ప్రాంతాల్లోని వివిధ ఏటీఎంలలో నింపడానికి రూ.68 లక్షలతో ఒంగోలు నుంచి బయల్దేరారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒంగోలులోని కర్నూలు రోడ్డులో ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద తమ వాహనాన్ని ఆపి.. టిఫిన్ తినేందుకు పెట్రోల్ బంకులోని ఓ గదిలోకి వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత డోర్ తీసి చూసిన సిబ్బంది షాకయ్యారు. కేవలం వంద రూపాయల నోట్ల కట్టలు మాత్రమే కనిపించాయి. రూ.500 నోట్ల కట్టలు మిస్ అయ్యాయి.
మొత్తం సొమ్ములో నుంచి రూ. 66 లక్షలు చోరీకి గురైనట్లు గుర్తించిన CMS సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి.. ముసుగు ధరించిన వ్యక్తి బైక్ పై వచ్చి.. వాహనంలోని నగదు తీసుకుళ్తున్నట్లు గుర్తించారు. విచారణ చేపట్టిన పోలీసులు.. గంటల వ్యవధిలోనే సదరు వ్యక్తిని గుర్తించారు. గతంలో CMS సంస్థలో పనిచేసి మానేసిన మహేష్‌గా గుర్తించారు. సంతనూతలపాడు కామేపల్లివారిపాలెంకు చెందిన మహేష్ ఇంటికి వెళ్లి విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు. తన ఇంటికి సమీపంలోని మర్రిచెట్టు తొర్రలో నగదు దాచినట్లు పోలీసులకు చెప్పడంతో మొత్తం నగదు స్వాధీనం చేసుకున్నారు.