Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు కోసం పోస్ట్ కార్డ్ లతో కామెడీ ఉద్యమం

చంద్రబాబుని బేషరతుగా విడుదల చేయాలంటూ రాజమండ్రి జైలుకి పోస్ట్ కార్డులు పంపించడం వల్ల ఉపయోగం ఏంటి..? అలా కార్డులు పంపిస్తే నిజంగానే జైలునుంచి విడుదల చేస్తారా..? ఎల్లోమీడియా ప్రచారం చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

చంద్రబాబు కోసం పోస్ట్ కార్డ్ లతో కామెడీ ఉద్యమం
X

చంద్రబాబుకోసం పోస్ట్ కార్డులు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైలు పోస్ట్ కార్డులతో నిండిపోతోంది. రోజు రోజుకీ కార్డ్ ల సంఖ్య పెరుగుతోంది.

ఈనెల 20న 2,150 కార్డులు

21న 6,250 కార్డులు

22వతేదీన 8,340

ఫైనల్ గా 23వతేదీన 23,570 కార్డులు..

ఈ కార్డులు కాకుండా నాలుగు రోజుల్లో 60 స్పీడ్ పోస్ట్ లు, 90 రిజిస్టర్డ్ పోస్ట్ లు, 300 ఆర్డినరీ పోస్ట్ లు రాజమండ్రి జైలుకి చేరుకున్నాయి.

ఇదీ చంద్రబాబు ట్రాక్ రికార్డ్ అంటూ ఎల్లో మీడియా హోరెత్తిపోతోంది.

స్కిల్ స్కామ్ కి, పోస్ట్ కార్డ్ లకు సంబంధం ఏంటి..?

చంద్రబాబు అరెస్ట్, జ్యుడీషియల్ రిమాండ్, బెయిల్ రాకపోవడం, సీఐడీ కస్టడీకి కూడా కోర్టు ఓకే చెప్పడంతో టీడీపీకి దెబ్బమీద దెబ్బపడిపోయింది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితి. కేడర్ కి సలహాలిచ్చేవారు లేరు, నిరసన కార్యక్రమాలు, నల్ల రిబ్బన్లు, సంతకాల సేకరణ అంటూ హడావిడి చేస్తున్నారు. వ్యవహారం జైలు, కోర్టుల మధ్య ఉంటే.. బయట నిరసన కార్యక్రమాలతో ఒరిగేదేంటో అర్థం కావట్లేదు. దోమల స్టోరీకి సింపతీ రాలేదు, ఇప్పుడు పోస్ట్ కార్డుల ఉద్యమం అంటూ మరో కామెడీ మొదలైంది.

చంద్రబాబుని బేషరతుగా విడుదల చేయాలంటూ రాజమండ్రి జైలుకి పోస్ట్ కార్డులు పంపించడం వల్ల ఉపయోగం ఏంటి..? అలా కార్డులు పంపిస్తే నిజంగానే జైలునుంచి విడుదల చేస్తారా..? పోనీ వంద కాదు, వెయ్యి కాదు, లక్ష, కోటి కార్డులు పంపిస్తే ప్రయోజనం ఏమైనా ఉంటుందా..? అసలు బాబుకోసం పోస్ట్ కార్డులు ఎందుకు వేయాలి..? ఎల్లోమీడియా ప్రచారం చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఆ లెక్కన చూస్తే డేరాబాబాకోసం ప్రతి రోజూ వేల సంఖ్యలో పోస్ట్ కార్డ్ లు, ఉత్తరాలు జైలుకి వస్తుంటాయి. రేపిస్ట్ లకు కూడా వేల సంఖ్యలో రాఖీలు వచ్చిన ఉదాహరణలున్నాయి. చేయాల్సింది చేయకుండా లోకేష్ ఢిల్లీలో కూర్చున్నారు, అసెంబ్లీకి టీడీపీ ఎమ్మెల్యేలు మొహం చాటేశారు, కార్యకర్తలు రోడ్డుమీద ఉన్నారు. అందుకే ఎల్లో మీడియా.. 'పోస్ట్ కార్డ్ లు - కుప్పలు తెప్పలు' అంటూ వార్తలిస్తోంది.

First Published:  24 Sept 2023 7:44 AM IST
Next Story