చిరంజీవి పరువు తీసేసిన పోసాని..
చిరంజీవి పక్కా బిజినెస్ మేన్ అని అన్నారు పోసాని. ఆయనకు ప్రజలంటే చాలా తక్కువ అభిప్రాయం ఉందని అన్నారు.
తమ్ముడు పవన్ కల్యాణ్ గెలుపుకోసం చిరంజీవి ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. కేవలం తన తమ్ముడిని మాత్రమే గెలిపించాలని ఆ వీడియోలో ఆయన పిఠాపురం ఓటర్లకు ఉపదేశమిచ్చారు. పవన్ గెలిస్తే చాలా? కనీసం జనసేన అభ్యర్థులు గెలవాల్సిన అవసరం లేదా? పోనీ కూటమికి కూడా ఓట్లు వేయాలని చిరంజీవి అడగలేదే..? అంటూ ట్రోలింగ్ మొదలైంది. ఇప్పుడు అంతకంటే ఘాటుగా పోసాని రియాక్ట్ అయ్యారు, చిరంజీవి పరువు తీశారు.
చిరంజీవి పక్కా బిజినెస్ మేన్ అని అన్నారు పోసాని. ఆయనకు రాజకీయాలంటే బిజినెస్ అని తేల్చేశారు. ఆయనకు ప్రజలంటే చాలా తక్కువ అభిప్రాయం ఉందని అన్నారు. వాళ్లేం చేస్తారులే అని చిరంజీవి అనుకుంటారని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లు వచ్చినా కూడా ఆయన వారిని అమ్మేశారని ఎద్దేవా చేశారు పోసాని. పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిపోవాలని చిరంజీవి అనుకున్నారని, అది కుదరకపోవడంతో ప్లేటు ఫిరాయించారని, ప్రతిపక్షంలో కూర్చునే ఓపిక లేక, చివరకు పార్టీని అమ్మేశారన్నారు. పోనీ కాంగ్రెస్ లోకి వెళ్లి కేంద్ర మంత్రి పదవి తీసుకున్నాక అక్కడైనా ఉన్నారా అంటే అదీ లేదన్నారు పోసాని.
రాజకీయం సెట్ కాదు, వద్దని వెళ్లిపోయిన చిరంజీవి మళ్లీ ఇప్పుడెందుకు రాజకీయాలు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు పోసాని. చిరంజీవి జీవితంలో మళ్లీ ప్రజల దగ్గరకు వెళ్లొచ్చా? అని అడిగారు. చిరంజీవి వెన్నుపోటు పొడిచినందుకు కాపు యువత బలయ్యారని విమర్శించారు. మొత్తమ్మీద తమ్ముడికి సపోర్ట్ చేస్తూ వీడియో విడుదల చేసిన చిరంజీవి సోషల్ మీడియాకు బుక్కైపోయారు. ఇప్పుడు పోసాని రియాక్షన్ మెగాస్టార్ ని మరింతగా ఇరుకున పెట్టేలా ఉంది.