Telugu Global
Andhra Pradesh

ఏపీలో విధ్వంస రాజకీయం.. వైసీపీ ఆఫీసు కూల్చివేత

కేసులో తుది ఉత్తర్వులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టొద్దని కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు, ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఏపీలో విధ్వంస రాజకీయం.. వైసీపీ ఆఫీసు కూల్చివేత
X

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ప్రతీకార రాజకీయాలకు తెరలేపింది. ఇందులో భాగంగా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ సెంట్రల్ ఆఫీసు కూల్చివేతకు ఆదేశించింది. దీంతో తెల్లవారు జామునే భారీ పోలీసు సెక్యూరిటీ మధ్య నిర్మాణంలో ఉన్న భవనాలను CRDA అధికారులు కూల్చివేశారు.

భవనాల కూల్చివేత కుట్రలను ముందే పసిగట్టిన వైసీపీ.. శుక్రవారమే హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో చట్ట విరుద్ధంగా వ్యవహరించొద్దని అధికారులను హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ తెల్లవారుజామున CRDA అధికారులు పోలీసు పహారా నడుమ మున్సిపల్ అధికారులతో కలిసి కూల్చివేతలు ప్రారంభించారు.


పార్టీ ఆఫీసు నిర్మాణాలను కూల్చివేయడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ కేసులో తుది ఉత్తర్వులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టొద్దని కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు, ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. దీనిపై మరోసారి కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు వైసీపీ నేతలు.

First Published:  22 Jun 2024 8:30 AM IST
Next Story