Telugu Global
Andhra Pradesh

ఏపీ ఎన్నికలపై తాజా సర్వే.. వైసీపీకి ఎన్ని సీట్లంటే..?

ఏపీ ఎన్నికలపై తాజాగా ఓ సర్వే సంస్థ తన ఫలితాలను విడుదల చేసింది. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారో అనే విషయాన్ని త‌న నివేదిక ద్వారా స్పష్టంచేసింది.

ఏపీ ఎన్నికలపై తాజా సర్వే.. వైసీపీకి ఎన్ని సీట్లంటే..?
X

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఈసారి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో హోరాహోరీ తప్పదన్న మాట వినిపిస్తోంది. వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తామని వైసీపీ ధీమాగా ఉండగా.. ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని తెలుగుదేశం+జనసేన కూటమి పట్టుదలతో ఉంది. అయితే ఏపీ ఎన్నికలపై తాజాగా ఓ సర్వే సంస్థ తన ఫలితాలను విడుదల చేసింది. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారో అనే విషయాన్ని త‌న నివేదిక ద్వారా స్పష్టంచేసింది.


పొలిటికల్ క్రిటిక్ అనే సంస్థ తన సర్వే ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఏపీలో జ‌రిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీ 115 స్థానాలు గెలుస్తుందని స్పష్టం చేసింది. ఇక తెలుగుదేశం, జన‌సేన కూటమి 60 స్థానాలతో సరిపెట్టుకుంటాయని తేల్చింది. ఈ అంచనాల్లో 5 సీట్లు పెరుగుదల లేదా తగ్గుదల ఉండే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది.

సర్వే ఫలితాల ప్రకారం వైసీపీకి 48 శాతం మంది ఓటర్ల మద్దతు ఉందని.. టీడీపీ+జనసేన కూటమికి 44 శాతం, బీజేపీకి 1.5 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని తేల్చింది. ఇక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను సైతం పొలిటికల్ క్రిటిక్ సంస్థ వెల్లడించింది. మొత్తం ఏపీలో 25 లోక్‌సభ స్థానాలుండగా.. వైసీపీ 17 స్థానాల్లో విజయం సాధిస్తుందని.. టీడీపీ+జనసేన కూటమికి 8 స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది. ఇప్పటివరకు మెజార్టీ సర్వే సంస్థలు ఏపీలో వైసీపీకే అనుకూల పరిస్థితులు ఉన్నాయని స్పష్టం చేస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన కూటమిని ప్రజలు విశ్వసించట్లేదని చెప్తున్నాయి.

First Published:  23 Jan 2024 4:55 AM GMT
Next Story