షర్మిల ఏమి సమాధానం చెబుతారు..? ఏమిచేస్తారు..?
పులివెందుల పోలీసులు విశాఖపట్నం వెళ్ళి విచారించి తండ్రి, కొడుకులను అరెస్టుచేసి కడపకు తీసుకొచ్చారు. ఈ ఇద్దరినీ పోలీసులు మీడియా ముందుంచి వీళ్ళ బాగోతమంతా బయటపెట్టారు.
కొద్దిరోజులుగా కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల తన అన్న జగన్మోహన్ రెడ్డిపైన ఒక విషయంలో నానా గోలచేస్తోంది. అదేమిటంటే.. సోషల్ మీడియాలో చెల్లెలు అని కూడా చూడకుండా తనపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిస్తాడా..? అసభ్యకరమైన పోస్టులు పెట్టే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడా..? అంటూ రచ్చ చేస్తున్నారు. చెల్లెలు అని కూడా చూడకుండా తనతో పాటు తన కుటుంబాన్ని జగన్ ఇంత నీచంగా టార్గెట్ చేస్తారా అంటూ ఒకటే గోలచేస్తున్నది.
సీన్ కట్ చేస్తే.. విజయమ్మ, షర్మిల, ఆమెభర్త అనీల్, వివేకానందరెడ్డి కూతురు సునీత మీద సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులకు టీడీపీ సోషల్ మీడియా విభాగం ఐ-టీడీపీనే కారణమని పోలీసులు తేల్చారు. విశాఖపట్నంకు చెందిన ఉదయ్ భూషణ్ అనే టీడీపీ సానుభూతిపరుడి పనే ఇదంతా అని పోలీసులు విచారణలో తేలింది. కడపకు చెందిన వైఎస్ జగన్ అభిమాని వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఉదయ్ ఒక ఫేక్ ఫేస్ బుక్ ఐడీ తయారుచేశాడు. ఆ ఐడీ నుండి పదుల సంఖ్యలో షర్మిల తదితరుల మీద అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడు.
షర్మిల, సునీతేమో రవీంద్రారెడ్డి మీద ఫిర్యాదులు చేశారు. తాను ఆ పోస్టులు పెట్టలేదని ఎంత మొత్తుకున్నా వీళ్ళు వినిపించుకోలేదు. జగన్ మీదపడి షర్మిల ప్రతిరోజు గోలచేస్తున్నది. చివరకు రవీంద్రారెడ్డి ఫిర్యాదుతో కడప పోలీసులు రంగంలోకి దిగారు. దాంతో తీగలాగితే మొత్తం డొంకంతా బయటపడింది. ఐ-టీడీపీలో యాక్టివ్ ఉండే ఉదయ భూషణ్ అసభ్యకరమైన పోస్టులు పెట్టడమే కాకుండా తన మైనర్ కొడుకుతో కూడా పోస్టులు పెట్టిస్తున్నట్లు తేలింది. ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసులు వైజాగ్ వెళ్ళారు.
పులివెందుల పోలీసులు విశాఖపట్నం వెళ్ళి విచారించి తండ్రి, కొడుకులను అరెస్టుచేసి కడపకు తీసుకొచ్చారు. ఈ ఇద్దరినీ పోలీసులు మీడియా ముందుంచి వీళ్ళ బాగోతమంతా బయటపెట్టారు. ఐ-టీడీపీలో కీలకపాత్ర పోషిస్తున్న చింతకాయల విజయ్ ఆదేశాల ప్రకారమే ఉదయ్ భూషణ్, ఆయన కొడుకు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నట్లు అంగీకరించారట. ఇన్ని రోజులు జగన్ను నానా మాటలన్న షర్మిల ఇపుడేమంటారు..? చంద్రబాబునాయుడు, లోకేష్ కు తెలీకుండా ఐ-టీడీపీ కార్యకర్తలు షర్మిల మీదే కాదు ఎవరిపైనా అసభ్యకరమైన పోస్టులుపెట్టరు. కాబట్టి చంద్రబాబు, లోకేష్ పై షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేస్తారా..? అన్నది చూడాలి.