Telugu Global
Andhra Pradesh

టీడీపీ ఫిర్యాదు.. సజ్జలపై కేసు

ఎన్నికల కౌంటింగ్ రోజు ఏజెంట్లకు పలు సూచనలు చేసే క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఎల్లో మీడియా వక్రీకరించింది.

టీడీపీ ఫిర్యాదు.. సజ్జలపై కేసు
X

వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ ఫిర్యాదు మేరకు 153, 505, 125 సెక్షన్ల కింద కేసు పెట్టారు. వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టేలా సజ్జల మాట్లాడారంటూ టీడీపీ నేతలు దేవినేని ఉమా, గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుని పరిగణలోకి తీసుకున్న తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు మొదలు పెట్టారు.

సజ్జల ఏమన్నారు..?

ఎన్నికల కౌంటింగ్ రోజు ఏజెంట్లకు పలు సూచనలు చేసే క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఎల్లో మీడియా వక్రీకరించింది. ప్రత్యర్థి వర్గాన్ని నిలువరించాలంటే అప్రమత్తంగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని వక్రీకరించి రూల్స్ బ్రేక్ చేయాలని సజ్జల చెప్పినట్టుగా ప్రచారం జరిగింది. ఎల్లో మీడియా కూడా ఎడిటింగ్ వీడియోలను ప్రసారం చేసింది. ఈ ప్రచారం వైరల్ అయిన తర్వాత టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ఏపీలో వైపీసీ..?

ఏపీలో ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ) అమలులో లేదని, ఎల్లో పీనల్ కోడ్(వైపీసీ) అమలులో ఉందనే విమర్శలు వినపడుతున్నాయి. టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తే వెంటనే పోలీసులు కేసులు పెడుతున్నారని, తాము ఎన్నిసార్లు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు అంటున్నారు. ఎన్నికల కమిషన్, ఏపీ పోలీసుల్లో కొంతమంది టీడీపీకి వంత పాడుతున్నారని మండిపడ్డారు. సజ్జలపై కేసు పెట్టడం దుర్మార్గం అంటున్నారు వైసీపీ నేతలు.

First Published:  31 May 2024 3:57 AM GMT
Next Story