Telugu Global
Andhra Pradesh

బాపట్ల రేపిస్టులను 48 గంటల్లోనే..

బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం యువతి అత్యాచారం, హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

బాపట్ల రేపిస్టులను 48 గంటల్లోనే..
X

బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం యువతి అత్యాచారం, హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును స్వయంగా సీఎం చంద్రబాబు పర్యవేక్షించడంతో అధికారులు వేగంగా స్పందించారు. ఘటన జరిగిన 48 గంటల్లోనే నిందితుల్ని పట్టుకున్నారు. ఈపురుపాలెం ఓడరేవుకు వెళ్లే మార్గంలో ముగ్గుర్ని అరెస్ట్ చేశారు.

బాధితురాలు ఇంటర్‌తోనే చదువు ఆపేసింది. ఇంటి వద్దే ఉంటూ మిషన్ కుడుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. శుక్రవారం ఉదయం బహిర్భూమికి వెళ్లింది. మత్తుకు బానిసలైన ఇద్దరు యువకులు యువతిని చెట్ల పొదల్లోకి లాక్కెల్లి అత్యాచారం చేశారు. అనంతరం ముఖంపై కొట్టి.. నోరు, ముక్కు మూసి హత్య చేశారు. వీళ్లకు మరో యువకుడు సహకరించాడు.

నిందితులను దేవరకొండ విజయ్, దేవరకొండ శ్రీకాంత్, కారంకి మహేష్‌గా గుర్తించారు. ముగ్గురూ ఈపురుపాలెంకు చెందిన వాళ్లే. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి వెతికారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని 48 గంటల్లోనే నిందితుల్ని పట్టుకున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ. 10 లక్షల పరిహారం ప్రకటించింది.

First Published:  23 Jun 2024 10:57 AM IST
Next Story