పూర్ణానంద స్వామీజీకి పోక్సో కోర్టులో చుక్కెదురు
మరోవైపు ఈ కేసులో స్వామీజీకి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది పోక్సో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పోక్సో కేసులో జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీజీకి చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఆయనపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈనెల మొదటి వారంలో టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ నిర్వహించారు. ఆ సందర్భంగా స్వామీజీని బాధితులు గుర్తుపట్టారు. ఇద్దరు మైనర్లపై లైంగిక దాడి జరిగినట్టు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది.
అయితే మరోవైపు ఈ కేసులో స్వామీజీకి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది విశాఖ పోక్సో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లైంగిక వేధింపులకు సంబంధించి పూర్ణానంద స్వామీజీపై అన్ని ఆధారాలూ వ్యతిరేకంగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయడం ప్రమాదకరమని పోక్సో కోర్టు స్పెషల్ పీపీ కరణం కృష్ణ వాదనలు వినిపించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన కోర్టు స్వామీజీ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.