Telugu Global
Andhra Pradesh

ప్యాకేజ్ లో సబ్ ప్యాకేజ్.. చల్లబడిన పిఠాపురం వర్మ

పిఠాపురంలో వర్మను రెచ్చగొట్టిన చంద్రబాబే, చివరకు ట్రబుల్ షూటర్ గా రంగంలోకి దిగారు. ఎమ్మెల్సీ హామీతో వర్మను బుజ్జగించినట్టు బిల్డప్ ఇచ్చారు.

ప్యాకేజ్ లో సబ్ ప్యాకేజ్.. చల్లబడిన పిఠాపురం వర్మ
X

పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని చెప్పగానే అక్కడ అలజడి సృష్టించారు టీడీపీ నేత వర్మ. రెండు రోజులుగా ఆయన టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ గా మారారు. సీటు పోయిందని హాట్ హాట్ గా ఉన్న వర్మ ఎట్టకేలకు ఈరోజు మెత్తబడ్డారు. చంద్రబాబు హామీతో ఆయన సంతృప్తి చెందారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపుకోసం కృషి చేస్తానన్నారు. అధినేత ఆదేశాల మేరకు తాను పనిచేస్తానని చెప్పారు వర్మ.

సబ్ ప్యాకేజ్..

పవన్ కల్యాణ్ ను ప్యాకేజీ స్టార్ గా వైసీపీ అభివర్ణిస్తోంది. అలాంటి పవన్ కి దారిచ్చేందుకు అసంతృప్త నేత వర్మ సబ్ ప్యాకేజీ తీసుకున్నారు. కూటమి గెలిచిన తర్వాత తొలి విడతలో ఎమ్మెల్సీ సీటు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఈ ప్యాకేజీతో సంతృప్తి పడి వర్మ, పవన్ కు అడ్డులేకుండా సైలెంట్ అవుతున్నారు. చంద్రబాబు ఇంట్లో ఆయనతో భేటీ అయిన వర్మ ఎట్టకేలకు బెట్టు వీడటంతో జనసేన నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

అంతా డ్రామా.. అందులో ట్విస్ట్

మూడు పార్టీలు పొత్తులో ఉన్నాయి, అధినేతల ఇష్ట ప్రకారం సీట్లు విభజించారు. మిగతా ఎక్కడా అసంతృప్తి రాలేదు కానీ, ఒక్క పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానంలోనే గొడవ జరిగింది. దీంతో పవన్ బెదిరిపోయారు. పిఠాపురంలో వర్మను రెచ్చగొట్టిన చంద్రబాబే, చివరకు ట్రబుల్ షూటర్ గా రంగంలోకి దిగారు. ఎమ్మెల్సీ హామీతో వర్మను బుజ్జగించినట్టు బిల్డప్ ఇచ్చారు. పవన్ ముందు హీరోలాగా బాబు బిల్డప్ ఇస్తున్నారు. ఆ లెక్కన జనసేన నుంచి కూడా త్యాగం చేస్తున్న ప్రతి ఒక్కరినీ పవన్ కల్యాణ్ పిలిపించి మరీ ఎమ్మెల్సీ హామీ ఇవ్వాలి కదా. కానీ ఎక్కడా జనసైనికులు ఈ డ్రామా తెలియలేదు కదా, అందుకే రెచ్చిపోలేదు. రెచ్చిపోయినా పవన్ వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదని వారికీ తెలుసు. టీడీపీలో మాత్రం పవన్ కి వ్యతిరేకంగా వర్మను గిల్లి మరీ రెచ్చగొట్టిన చంద్రబాబు, ఇప్పుడు సమస్య పరిష్కారం చేసినట్టు బిల్డప్ ఇస్తున్నారు.

First Published:  16 March 2024 6:25 PM IST
Next Story