కడుపులో ఇంత విషం పెట్టుకున్నావా పవన్..?
మీరు మాట్లాడే మాటలు ప్రవచనాలా? మీకు మాత్రమే వ్యక్తిత్వం ఉంటుందా? అని పవన్ ని ప్రశ్నించారు నాని. పేదల కోసం పనిచేస్తున్న వాలంటీర్ల వ్యక్తిత్వాన్ని కించపరచడం సబబా అని అడిగారు.
కొన్నాళ్ల విరామం తర్వాత మళ్లీ పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వాలంటీర్లకు పవన్, చంద్రబాబు ఇద్దరూ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లపై కడుపులో ఇంత విషం పెట్టుకున్నావా పవన్ అని ప్రశ్నించారు నాని.
వాలంటీర్ వ్యవస్థ అంటే అంత భయమా..?
ఏపీలో జరుగుతున్న అభివృద్ధి, సీఎం జగన్ మానస పుత్రికలాంటి వాలంటీర్ వ్యవస్థ చూసి చంద్రబాబు, పవన్ భయంతో వణికిపోతున్నారని, అందుకే ఆ వ్యవస్థపై విషం చిమ్మేలా పవన్ తో చంద్రబాబు మాట్లాడించారని మండిపడ్డారు పేర్ని నాని. పేద, బలహీన వర్గాలకు వాలంటీర్లు ఎనలేని సేవ చేస్తున్నారని చెప్పారు. నామమాత్రపు పారితోషికంతో సామాజిక బాధ్యతతో వారు పనిచేస్తున్నారని అన్నారు. వాలంటీర్లపై అంత నమ్మకం లేకపోతే.. ఆ వ్యవస్థను రద్దు చేస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టగలరా అని సవాల్ విసిరారు. వాలంటీర్లలో సగానికిపైగా మహిళలున్నారని, అలాంటి వారిని ఉద్దేశించి దిగజారి మాట్లాడతారా అని ప్రశ్నించారు నాని.
మీరు మాట్లాడే మాటలు ప్రవచనాలా? మీకు మాత్రమే వ్యక్తిత్వం ఉంటుందా? అని పవన్ ని ప్రశ్నించారు నాని. పేదల కోసం పనిచేస్తున్న వాలంటీర్ల వ్యక్తిత్వాన్ని కించపరచడం సబబా అని అడిగారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పుల్ని పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. తమ ప్రభుత్వంలోనే తప్పులు జరిగాయని అనడం సరికాదన్నారు. అవాస్తవాలతో ప్రభుత్వంపై పవన్ బురదజల్లుతున్నారంటూ మండిపడ్డారు.
సీఎం జగన్ ను ఏకవచనంతో పిలిస్తే తాము కూడా అదే రీతిలో పవన్ కి సమాధానం చెబుతామన్నారు పేర్ని నాని. పవన్‌కు మాత్రమే నోరుందా, పవన్ కుమాత్రమే నాలుక ఉందా.. వైసీపీ జెండా మోసే ప్రతి ఒక్కరికీ నాలుక, నోరు ఉన్నాయని పవన్ గుర్తు పెట్టుకోవాలన్నారు. పనన్, చంద్రబాబు కాళ్లు మొక్కినా తమకేమీ ఇబ్బంది లేదన్నారు నాని.