కాంతారావు సినిమా రోజులు కావు.. బాబుపై పేర్ని నాని సెటైర్లు
సానుభూతి డ్రామాలకు బాబు బాగా అలవాటు పడ్డారని, అందుకే ఇప్పుడు హత్యాయత్నాలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు పేర్ని నాని.
చంద్రబాబు, చంద్రబాబు కొడుకు లోకేష్ ని హత్యచేయడానికి వైసీపీ నేతలు పథకాలు రచిస్తున్నారంటూ ఇటీవల టీడీపీ నుంచి ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఈ ఆరోపణలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. మర్డర్ ప్లాన్లు వేయడానికి ఇవి కాంతారావు సినిమా రోజులు కావని చెప్పారు నాని. చంద్రబాబును చంపాల్సిన అవసరం ఎవరికి ఉందని ప్రశ్నించారు. దిక్కుమాలిన ప్రతిపక్ష నాయకుడిని ఎవరైనా చంపాలని అనుకుంటారా అని అన్నారు. సానుభూతి డ్రామాలకు బాబు బాగా అలవాటు పడ్డారని, అందుకే ఇప్పుడు హత్యాయత్నాలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు నాని.
ఇదేమి ఖర్మ సిగ్గులేకుండా..
చంద్రబాబు సిగ్గులేకుండా ఇదేమి ఖర్మ అంటూ రోడ్లపైకి వస్తున్నారని ఎద్దేవా చేశారు పేర్ని నాని. ఎన్టీఆర్ పెట్టిన శాపం చంద్రబాబుకు తగలడం వల్లే ఇప్పుడీ ఈ స్థితికి పడిపోయారని, ఎన్టీఆర్ కి బాబు చేసిన ద్రోహానికి ప్రతిఫలం 2024 ఎన్నికల్లో ఇంకా గట్టిగా లభిస్తుందని అన్నారు.
శ్రీలంక అవుతుందన్నారుగా..?
సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఏపీ మరో శ్రీలంకలా తయారవుతుందని టీడీపీ నేతలు దుష్ప్రచారం చేశారని, చివకు వారే ఇప్పుడు సంక్షేమ పథకాలు మంచివని ?ఒప్పుకున్నారని, తాము అధికారంలోకి వస్తే వాటిని కొనసాగిస్తామని చెప్పుకుంటున్నారని అన్నారు నాని. అంటే అధికారం కోసం వారు ఎంతకైనా దిగజారతారని, ఎన్నిసార్లయినా మాటలు మారుస్తారని ఎద్దేవా చేశారు.
డూప్లికేట్ స్వామీజీ చంద్రబాబు..
చంద్రబాబు పరిస్థితి డూప్లికేట్ స్వామీజీలాగా ఉందని అన్నారు పేర్ని నాని. అసలు బాబుకి మైండ్ ఉందా లేదా అని ప్రశ్నించారు. ఆయన వైఖరి చూస్తే ప్రజలు ఇదేమి ఖర్మ అనుకుంటున్నారని, జనం ఛీకొడుతున్నా చంద్రబాబుకి సిగ్గు రాలేదని అన్నారు. విజయవాడలో కందిపప్పు రేటెంత, చంద్రబాబు హెరిటేజ్ లో రేటెంత అని ప్రశ్నించారు నాని.