పశువుల డాక్టర్, లారీ క్లీనర్. పేర్ని నాని తిట్టారా..? పొగిడారా..?
2004, 2009లో టీడీపీ తరపున పోటీ చేసినప్పుడు కొడాలి నాని సాఫ్ట్‌వేర్ ఇంజినీరా? అని ప్రశ్నించారు. అప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉండి.. ఇప్పుడు మాత్రం లారీ క్లీనర్, కప్పులు కడిగే వాడిలా మారారా..? సమాధానం చెప్పండి అంటూ లోకేష్ ని నిలదీశారు. కొడాలి నాని చంద్రయాన్ సైంటిస్టు అని ఎప్పుడూ చెప్పుకోలేదు కదా అన్నారు పేర్ని నాని.
గన్నవరం సభలో నారా లోకేష్ ప్రసంగానికి కౌంటర్ ఇస్తూ ప్రెస్ మీట్ పెట్టారు మాజీ మంత్రి పేర్ని నాని. ఈ సందర్భంగా ఆయన మరోసారి లోకేష్ చేసిన విమర్శలను హైలైట్ చేశారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పశువుల డాక్టర్ అంటూ నారా లోకేష్ ఎద్దేవా చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఆ పశువుల డాక్టర్ తన దగ్గరకు వచ్చి చేతులు కట్టుకుని నిలబడేవాడని, ఇప్పుడు రెచ్చిపోతున్నాడని అన్నారు. పశువుల డాక్టర్ అనే వ్యాఖ్యలకు పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. టీడీపీ తరపున పోటీ చేసినప్పుడు కూడా వంశీ పశువుల డాక్టరే కదా అన్నారు నాని. అప్పుడు మనుషుల డాక్టర్ అయ్యి, ఇప్పుడు వంశీ పశువుల డాక్టర్ గా మారాడా అని లోకేష్ ని ప్రశ్నించారు.
కొడాలి చంద్రయాన్ సైంటిస్ట్ అని చెప్పుకోలేదే..?
ఇక మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతలు చేసే విమర్శలకు కూడా పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. 2004, 2009లో టీడీపీ తరపున పోటీ చేసినప్పుడు కొడాలి నాని సాఫ్ట్‌వేర్ ఇంజినీరా..? అని ప్రశ్నించారు. అప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉండి.. ఇప్పుడు మాత్రం లారీ క్లీనర్, కప్పులు కడిగే వాడిలా మారారా..? సమాధానం చెప్పండి అంటూ నిలదీశారు. ఆ లారీ క్లీనర్ ని చూస్తే చంద్రబాబు, లోకేష్ కి ప్యాంట్లు తడుస్తున్నాయన్నారు. అసలు టీడీపీకి లారీ క్లీనర్లు, కప్పులు కడిగేవాళ్ల ఓట్లు అవసరం లేదా అని అడిగారు. కొడాలి నాని చంద్రయాన్ సైంటిస్టు అని ఎప్పుడూ చెప్పుకోలేదు కదా అన్నారు పేర్ని నాని.
నారా లోకేష్ కి దమ్ముంటే గుడివాడలో పోటీ చేయాలని సవాల్ విసిరారు పేర్ని నాని. సూర్యుడు అస్తమించాక లోకేష్ యాత్ర ప్రారంభం అవుతుందని ఎద్దేవా చేశారు. పాదయాత్ర పగటిపూట చేస్తే జనం ఛీ కొడతారని, అందుకే జనం నిద్ర పోయాక లోకేష్ అర్ధరాత్రి బయటకొస్తున్నారని అన్నారు. రోజుకు వెయ్యి రూపాయల చొప్పున డబ్బులు ఇచ్చి జనాలను యాత్రకు తరలిస్తున్నారని విమర్శించారు నాని.
అసలు పాదయాత్ర అంటే..?
పాదయాత్ర ఎలా చేయాలో వైఎస్సార్, జగన్ ల యాత్రల వీడియోలు చూసి నేర్చుకోవాలంటూ నారా లోకేష్ కి సలహా ఇచ్చారు పేర్ని నాని. జగన్ ఇచ్చే పథకాలనే తామూ ఇస్తామని చంద్రబాబు చెప్పడం వల్ల ఉపయోగమేంటని ప్రశ్నించారు. అవే పథకాలు అమలు చేస్తే చంద్రబాబు ఎందుకని, జగనే సీఎంగా కొనసాగితే సరిపోతుంది కదా అన్నారు నాని.