Telugu Global
Andhra Pradesh

సీఎంగా పవన్‌ కల్యాణ్‌.. అంబటి రాయుడు ట్వీట్‌ వైరల్‌

పవన్‌ ను ముఖ్యమంత్రిగా చూడాలనేది జన సైనికుల బలమైన కోరిక. తాజాగా మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు ఇదే విషయాన్ని తన ట్వీట్‌లో స్పష్టం చేశారు.

సీఎంగా పవన్‌ కల్యాణ్‌.. అంబటి రాయుడు ట్వీట్‌ వైరల్‌
X

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో ఆయన ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీగా ఉన్నారు. డిప్యూటీ సీఎం అని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. అధికారికంగా ప్రకటన రాలేదు. దాదాపు 16 ఏళ్ల రాజకీయ జీవితంలో పదేళ్ల నిరీక్షణ తర్వాత ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు పవన్‌. అంతేకాదు కేబినెట్‌లోనూ బెర్త్ సంపాదించారు. కానీ పవన్‌ ను ముఖ్యమంత్రిగా చూడాలనేది జన సైనికుల బలమైన కోరిక. తాజాగా మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు ఇదే విషయాన్ని తన ట్వీట్‌లో స్పష్టం చేశారు.


అంబటి రాయుడు ట్వీట్ ఇదే !

పవన్‌కల్యాణ్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు అంబటి రాయుడు. భవిష్యత్తులో ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలన్న కలకు ఇక ఒక్క అడుగు మాత్రమే మిగిలి ఉందంటూ తన మనసులో మాటను, జనసైనికుల కోరికను బయటపెట్టారు అంబటి. జనసేనలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఇదో గొప్పరోజంటూ ట్వీట్ చేశారు.



అంబటి రాయుడు కొద్ది రోజుల క్రితం రాజకీయాల్లోకి వస్తున్నానంటూ హడావుడి చేసిన విషయం తెలిసిందే. మొదటగా వైసీపీ కోసం జనాల్లో తిరిగి జగన్ చేత కండువా కూడా కప్పుకున్నారు. ఆడుదాం ఆంధ్ర పోటీలకు అంబాసిడర్‌గానూ వ్యవహరించారు. తర్వాత తను కోరిన సీటు దక్కదన్న సమాచారంతో ప్లేటు ఫిరాయించి జనసేనలో చేరారు. పవన్‌కు తాను పెద్ద అభిమానినని ప్రకటించుకున్నారు. తర్వాత కొన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్నారు. సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ప్రచారం కోసం అంబటి రాయుడుని స్టార్‌ క్యాంపెయినర్‌గానూ ప్రకటించింది జనసేన. గుంటూరులోని కొన్ని ప్రాంతాల్లో కూటమి తరపున అంబటి రాయుడు ప్రచారం కూడా చేశారు.

First Published:  12 Jun 2024 3:05 PM GMT
Next Story