రమ్మంటుంటే.. పారిపోతున్నారా..
చంద్రబాబు ఎంత పిలుస్తున్నా జనాలు రావటంలేదట. జనాల సంగతి దేవుడెరుగు ముందు పార్టీలోని తమ్ముళ్ళే మొహంచాటేస్తేన్నట్లు వినికిడి. చంద్రబాబు స్పీచులు రొటీన్ అయిపోయి మహా బోరింగ్ ఫీలవుతున్నారట.

చంద్రబాబు జనాలను ‘రా..కదలిరా’ అని పిలుస్తుంటే జనాలేమో రామురామని పారిపోతున్నారా..? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానం పెరిగిపోతోంది. తొందరలో జరగబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇందుకు 5వ తేదీనుండి 29వ తేదీ వరకు షెడ్యూల్ ప్రకటించారు. అయితే షెడ్యూల్ ప్రకారం కాకుండా ఇప్పటికి అయింది 10 బహిరంగసభలు మాత్రమే. 20 రోజుల్లో పది బహిరంగసభలు మాత్రమే ఎందుకయినట్లు ?
ఎందుకంటే చంద్రబాబు ఎంత పిలుస్తున్నా జనాలు రావటంలేదట. జనాల సంగతి దేవుడెరుగు ముందు పార్టీలోని తమ్ముళ్ళే మొహంచాటేస్తేన్నట్లు వినికిడి. చంద్రబాబు స్పీచులు రొటీన్ అయిపోయి మహా బోరింగ్ ఫీలవుతున్నారట. అలాగే జనసమీకరణ, బహిరంగసభల ఏర్పాట్ల విషయంలో తమ్ముళ్ళు ఆసక్తి చూపటంలేదట. ఎందుకంటే.. ఎవరైనా ఎందుకు ఖర్చులు పెట్టుకుంటారంటే రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇస్తారన్న ఆశతోనే. అలాంటిది ఖర్చులు మాత్రం పెట్టండి టికెట్లను అడగద్దని, త్యాగాలకు సిద్ధంగా ఉండాలంటే ఎవరొప్పుకుంటారు..?
అందుకనే చంద్రబాబు సభలంటేనే తమ్ముళ్ళు ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారట. చంద్రబాబు సభల్లో జనాలు పెద్దగా కనబడటంలేదు. బుధవారం జరగాల్సిన జీడీ నెల్లూరు, ఉరవకొండ, పీలేరు సభలు రద్దవటానికి ఇదే కారణమట. ఈనెల 27న గోపాలపురంలో బహిరంగసభ జరగాల్సుంది. అయితే అక్కడి తమ్ముళ్ళు బహిరంగసభ ఏర్పాట్లు, జనసమీకరణ ఖర్చులకు ఇష్టపడలేదట. అందుకనే గోపాలపురం సభను రద్దుచేసి దాన్ని 29వ తేదీన రాజమండ్రికి మార్చారని టాక్.
జరిగిన సభలన్నా సక్సెస్ అయ్యాయా అంటే అదీలేదు. ఆచంట, ఆళ్ళగడ్డ, తిరువూరు, కనిగిరి సభలు పెద్దగా సక్సెస్ కాలేదు. చివరకు ఎంతో ప్రిస్టేజియస్ గా తీసుకున్న గుడివాడ సభకు కూడా జనాలు పెద్దగా రాలేదు. చంద్రబాబు ప్రసంగం గంటసేపు జరిగితే అందులో వందసార్లు జగన్ను తిట్టడం తప్ప ఇంకేమీ ఉండటంలేదు. జగన్ తనకు ఓట్లేయమని అడుగుతున్నారంటే తన పాలనలో చేసిన మంచిని చెప్పుకుంటున్నారు. తన పాలనలో జరిగిన మంచిని చూసి ఓట్లేయమని చంద్రబాబు ఎందుకు అడగలేకపోతున్నారు..? తన పాలనలో మంచి జరిగిందని అనుకుంటునే తనకు ఓట్లేయమని జగన్ ధైర్యంగా అడిగినట్లే చంద్రబాబు అడగలేకపోతున్నారు. అందుకనే స్పీచులన్నీ బోరుకొట్టి జనాలు మొహంచాటేస్తున్నారట. అందుకనే రా..కదలిరా సభలు రద్దు లేదా వాయిదాలు పడుతున్నాయి.