Telugu Global
Andhra Pradesh

ఏపీ హైకోర్టుకు పింఛ‌న్ ల‌బ్ధిదారులు.. ఎందుకంటే.!

వాలంటీర్లు పెన్షన్‌లు పంపిణీ చేయడానికి వీలు లేదంటూ ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలంటూ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలైంది.

ఏపీ హైకోర్టుకు పింఛ‌న్ ల‌బ్ధిదారులు.. ఎందుకంటే.!
X

ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు పింఛ‌న్‌ ల‌బ్ధిదారులు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇంటికి వచ్చి పెన్షన్ అందించేలా చూడాలని పిటిషన్‌లో కోరారు. వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వకపోతే ఇబ్బంది పడుతామన్నారు.

వాలంటీర్లు పెన్షన్‌లు పంపిణీ చేయడానికి వీలు లేదంటూ ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలంటూ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలైంది. ఆఫీసుకు వెళ్లి తీసుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నామని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై రేపు విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు.

ఇక పెన్షన్ల అంశంపై మదనపల్లె బహిరంగ సభలో స్పందించారు జగన్. చంద్రబాబు లక్షల మందికి పెన్షన్ అందకుండా చేశారన్నారు. తన మనుషులతో ఈసీకి ఫిర్యాదు చేయించి వాలంటీర్లతో పెన్షన్ ఇవ్వకుండా చేశారన్నారు జగన్‌. పేదల పెన్షన్లకు చంద్రబాబు అడ్డుతగులుతున్నారని మండిపడ్డారు. తనను నేరుగా టార్గెట్‌ చేయలేకే.. పేదలకు నష్టం చేకూర్చారన్నారు జగన్.

First Published:  2 April 2024 8:22 PM IST
Next Story