Telugu Global
Andhra Pradesh

చేతికిస్తారా..? బ్యాంక్ లో వేస్తారా..? పెన్షన్ దారుల్లో టెన్షన్

ఇంటింటికీ తిరిగి పెన్షన్ ఇవ్వాలంటే వాలంటీర్లు అవసరం. ఎన్నికల వేళ చాలామంది రాజీనామాలు చేశారు. వారి సంగతేంటో తేలాల్సి ఉంది.

చేతికిస్తారా..? బ్యాంక్ లో వేస్తారా..? పెన్షన్ దారుల్లో టెన్షన్
X

ఎన్నికల వేళ, ఈసీ వాలంటీర్లను విధులకు దూరం చేయడంతో ఏపీలో పెన్షన్ దారులకు కష్టాలు మొదలయ్యాయి. కోడ్ మొదలైన మొదటి నెల సచివాలయాలకు వెళ్లి పెన్షన్ తెచ్చుకున్నారు, ఆ తర్వాత బ్యాంకుల్లో సొమ్ము డిపాజిట్ కావడంతో విత్ డ్రా చేసుకోడానికి వెళ్లిన వృద్ధులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగిసింది, ఈసారి పెన్షన్ చేతికే ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కానీ టైమ్ దగ్గరపడింది. కేవలం 6 రోజులు మాత్రమే టైమ్ ఉంది. ఈలోగా పెన్షన్ పంపిణీపై కొత్త మార్గదర్శకాలు విడుదలవడం, దానికి తగ్గట్టు సిబ్బంది సిద్ధం కావడం సాధ్యమేనా అనే అనుమానాలు మొదలవుతున్నాయి.

పెన్షన్ ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని ఎన్నికల వేళ చంద్రబాబు ఆరోపించిన సంగతి తెలిసిందే. సచివాలయ సిబ్బంది అంతమంది ఉండగా, పెన్షన్ ని ఇంటికి తీసుకెళ్లి ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారాయన. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక తొలి నెల పెన్షన్ పంపిణీ ఎలా జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. పైగా ఈ నెల పెన్షన్ బకాయిలు, పెంచిన మొత్తం అంతా కలిపి ఒక్కొకరికి రూ.7వేలు అందించాల్సి ఉంది. అంత పెద్ద మొత్తం ఇస్తున్నారంటే కచ్చితంగా నేతలు, కార్యకర్తలు గ్రౌండ్ లెవల్ కి వెళ్లి హడావిడి చేయాల్సి ఉంటుంది. సో.. కచ్చితంగా పెన్షన్ చేతికి అందిస్తారనే వాదన వినపడుతోంది.

టైమ్ ఉందా..?

ఇంటింటికీ తిరిగి పెన్షన్ ఇవ్వాలంటే వాలంటీర్లు అవసరం. ఎన్నికల వేళ చాలామంది రాజీనామాలు చేశారు. వారి సంగతేంటో తేలాల్సి ఉంది. కొత్తవారిని రిక్రూట్ చేసుకుంటారా..? వాలంటీర్లకు రూ.10వేల పారితోషికం ఎప్పట్నుంచి..? అనేవి ఇంకా ప్రశ్నలుగానే మిగిలున్నాయి. వీటన్నిటికీ ఒకేసారి ప్రభుత్వం సమాధానం చెబుతుందో లేదో తేలాల్సి ఉంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు పెన్షన్ సొమ్ము చేతికివ్వడం సాధ్యం కాకపోతే డీబీటీ కింద బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఒక్కసారికి ఇలా అడ్జస్ట్ అయిపోండి అని సర్దిచెబుతారా, లేక పెన్షన్ పెంపుని ప్రచారం కోసం టీడీపీ ఉపయోగించుకుంటుందా.. అనేది వేచి చూడాలి.

First Published:  24 Jun 2024 9:44 AM IST
Next Story