వారికి రిజర్వేషన్లు అక్కర్లేదు.. - పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
కోరుకునే వారందరికీ రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమేకాదని తన మనస్సులోని మాటను కుండబద్దలు కొట్టినట్టు పవన్ చెప్పేశారు.

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్ల అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న కాపుల రిజర్వేషన్లు, ముస్లింల రిజర్వేషన్లు అసలు అవసరమే లేదని ఆయన స్పష్టం చేశారు. అసలు ఆ రిజర్వేషన్లనే వ్యతిరేకిస్తూ పరోక్షంగా పలు వ్యాఖ్యలు కూడా చేయడం గమనార్హం. తాజాగా ఓ ఇంగ్లిష్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యల ద్వారా ముస్లిం రిజర్వేషన్ల అంశంపై బీజేపీ జాతీయ నాయకులు చేస్తున్న ప్రకటనలకు ఆయన మద్దతు ప్రకటించారు.
అంతేకాదు.. కోరుకునే వారందరికీ రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమేకాదని తన మనస్సులోని మాటను కుండబద్దలు కొట్టినట్టు పవన్ చెప్పేశారు. ఈ రిజర్వేషన్లకు ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచన చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ నేతల ప్రకటనల పట్ల తానేమీ నిరాశ, ఆందోళన చెందడం లేదని కూడా ఆయన చెప్పారు. అయినా, రిజర్వేషన్ల అమలుకన్నా యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలు పెంచేలా వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు.