Telugu Global
Andhra Pradesh

ప‌వ‌న్ వెంట అకీరా.. మురిసిపోతున్న రేణుదేశాయ్‌

ఢిల్లీకి భార్య అన్నా లెజినోవాతోపాటు అకీరాను వెంట‌బెట్టుకు వెళ్లారు ప‌వ‌న్‌. ప్ర‌ధాని మోడీకి త‌న కుటుంబాన్ని ప‌రిచయం చేశారు. మోడీకి అకీరా న‌మ‌స్క‌రిస్తుంటే ఆయ‌న ఆప్యాయంగా అత‌ని భుజం త‌డుతున్న దృశ్యాలూ మెగా ఫ్యాన్స్‌ను, జ‌న‌సైన్యాన్ని సంబ‌ర‌పెట్టాయి.

ప‌వ‌న్ వెంట అకీరా.. మురిసిపోతున్న రేణుదేశాయ్‌
X

ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు ఊరూవాడా మార్మోగిపోతోంది. కొనఊపిరితో ఉన్న త‌న పార్టీకి ప్రాణ‌వాయువునిచ్చిన ప‌వ‌న్‌కు ఇంటికొచ్చి మరీ కృత‌జ్ఞ‌తలు తెలిపారు చంద్ర‌బాబు. ఈ సంద‌ర్భంగా త‌న కుమారుడు అకిరా నంద‌న్‌ను ప‌వ‌న్.. చంద్ర‌బాబుకు ప‌రిచయం చేశారు. బాబు షేక్‌హ్యాండిస్తుంటే కాద‌ని పాదాభివంద‌నం చేయించారు. ఆ త‌ర్వాత తండ్రి టీడీపీ అధినేత‌తో మాట్లాడుతుంటే చేతులు క‌ట్టుకుని అకీరా నిల‌బ‌డిన ఫొటోలు, వీడియోలు ఇంట‌ర్నెట్‌లో, సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి.

ప్ర‌ధాని మోడీతో బిడ్డ‌.. రేణు సంబ‌రం

త‌ర్వాత రోజు ఎన్డీయే స‌మావేశానికి ఢిల్లీకి భార్య అన్నా లెజినోవాతోపాటు అకీరాను వెంట‌బెట్టుకు వెళ్లారు ప‌వ‌న్‌. ప్ర‌ధాని మోడీకి త‌న కుటుంబాన్ని ప‌రిచయం చేశారు. మోడీకి అకీరా న‌మ‌స్క‌రిస్తుంటే ఆయ‌న ఆప్యాయంగా అత‌ని భుజం త‌డుతున్న దృశ్యాలూ మెగా ఫ్యాన్స్‌ను, జ‌న‌సైన్యాన్ని సంబ‌ర‌పెట్టాయి. ఇక అకీరా త‌ల్లి రేణుదేశాయ్ అయితే త‌న బిడ్డ మోడీని క‌ల‌వ‌డంతో చాలా సంబ‌రంగా ఉన్నారు. త‌న అభిమాన నేత‌ను త‌న బిడ్డ క‌లవ‌డం చాలా ఆనందాన్నిచ్చింద‌ని ట్వీట్ చేశారు. మోడీని క‌ల‌వ‌గానే అకీరా ఫోన్ చేసి చాలా ఆనందంగా ఉంద‌మ్మా.. మోడీ గారిని క‌లిశాక ఏదో పాజిటివ్ వైబ్ నా చుట్టూ ఉన్న‌ట్లు అనిపిస్తోంద‌ని చెప్పాడ‌ని ఆమె ఎక్స్‌లో షేర్ చేశారు.

ప‌వ‌న్ సినీ జ‌ర్నీపై అకీరా వీడియో

మ‌రోవైపు తండ్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినీ జ‌ర్నీలోని కొన్ని సీన్లు, ప‌వ‌న్ ఎలివేష‌న్స్‌తో అకీరా త‌యారుచేసిన వీడియోనూ రేణు దేశాయ్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. దీనికి మెగా ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. తాను ప‌వ‌న్‌తో విడిపోయినా పిల్ల‌లు అకీ, ఆద్య‌ల‌ను తండ్రికి ద‌గ్గ‌ర‌గానే ఉంచుతున్నారు రేణు దేశాయ్‌. త్వ‌ర‌లో సినిమాల్లోకి కూడా అకీరాను తీసుకొచ్చేందుకు మెగా ఫ్యామిలీ ప్లాన్ చేస్తోంది. ఈ నేప‌థ్యంలో అత‌డ్ని ప‌వ‌న్ త‌న వార‌సుడిగా చంద్ర‌బాబు, మోడీ లాంటి అగ్ర‌నేత‌ల‌కు కూడా ప‌రిచ‌యం చేస్తుండ‌టంతో రేణు త‌ల్లి మ‌న‌సు సంతోషంతో ఉర‌క‌లేయ‌డం స‌హ‌జ‌మేగా.

First Published:  7 Jun 2024 9:28 AM GMT
Next Story