Telugu Global
Andhra Pradesh

పవన్‌కు హోంశాఖ రాదు.. ఇదిగో క్లారిటీ!

హోంశాఖ ఇవ్వాలని జనసైనికులు కోరుకుంటున్నారు. కానీ అందుకు బాబు సాహాసించే అవకాశాలు లేవు. హోంశాఖను తెలుగుదేశం దగ్గర పెట్టుకునేందుకే బాబు మొగ్గు చూపుతారు.

పవన్‌కు హోంశాఖ రాదు.. ఇదిగో క్లారిటీ!
X

ఏపీలో మంత్రులు ప్రమాణస్వీకారం చేసినప్పటికీ.. ఇప్పటివరకూ శాఖల కేటాయింపుపై అధికార ప్రకటన రాలేదు. మరోవైపు మీడియాలో మాత్రం మంత్రులకు ఈ శాఖలు కేటాయించబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈనాడు సైతం జనసేనకు కీలక శాఖలు కేటాయించనున్నట్లు రాసుకొచ్చింది. జనసేన నుంచి పవన్‌తో పాటు మరో ఇద్దరికీ మంత్రులుగా అవకాశం లభించింది.


ఇక మొదటి నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే పవన్‌కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు కేటాయిస్తారని తెలుస్తోంది. పవన్‌కు ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లు స్పష్టం చేసింది. పవన్‌ కోరిక మేరకే గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖలు కేటాయిస్తున్నట్లు సమాచారం. ఐతే హోంశాఖ ఇవ్వాలని జనసైనికులు కోరుకుంటున్నారు. కానీ అందుకు బాబు సాహాసించే అవకాశాలు లేవు. హోంశాఖను తెలుగుదేశం దగ్గర పెట్టుకునేందుకే బాబు మొగ్గు చూపుతారు.


ఇక జనసేనలో మిగిలిన ఇద్దరు మంత్రులు కందుల దుర్గేష్‌కు టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖలను ఇస్తారని సమాచారం. ఇక మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు పౌరసరఫరాల శాఖ కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇవాళ సాయంత్రంలోగా మంత్రుల శాఖలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబుతో పాటు మరో 24 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మరో కేబినెట్ బెర్త్ ఖాళీగా ఉంది.

First Published:  13 Jun 2024 10:41 AM IST
Next Story