పవన్ కల్యాణ్ ఓటు.. గాజు గ్లాసుకు కాదు..!
కాసేపటి క్రితమే తన భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు పవన్. పవన్ పోటీ చేస్తున్నది పిఠాపురం ఐనా.. ఆయనకు ఆ నియోజకవర్గ పరిధిలో ఓటు లేదు.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఐతే తన ఓటు మాత్రం తనకు గానీ, తన సొంత పార్టీ జనసేన అభ్యర్థికి గానీ వేసుకోలేని పరిస్థితి పవన్‌కల్యాణ్‌ది.
కాసేపటి క్రితమే తన భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు పవన్. పవన్ పోటీ చేస్తున్నది పిఠాపురం ఐనా.. ఆయనకు ఆ నియోజకవర్గ పరిధిలో ఓటు లేదు. మంగళగిరి పరిధిలో ఓటు ఉండడంతో అక్కడే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంగళగిరిలో కూటమి అభ్యర్థిగా చంద్రబాబు తనయుడు లోకేశ్ పోటీ చేస్తున్నారు. దీంతో మంగళగిరిలో పవన్‌కల్యాణ్ సైకిల్ గుర్తుకు ఓటు వేయాల్సిన పరిస్థితి.
మంగళగిరిలో కుటుంబంతో కలిసి ఓటు వేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ pic.twitter.com/BG54x2Cflp
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024
ఇక తను పోటీ చేసే స్థానంపై చివరివరకు తేల్చుకోలేకపోయారు పవన్. చివరగా సొంత సామాజికవర్గం కాపుల ఓట్లు ఎక్కువగా ఉన్న పిఠాపురంను ఎంచుకున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ రెండు చోట్ల ఓడిపోయారు.