Telugu Global
Andhra Pradesh

విజయవాడకు పవన్.. వారాహి పార్ట్-3 ఎప్పట్నుంచంటే..?

పశ్చిమగోదావరి జిల్లాలో మిగిలిన నియోజకవర్గాలను కవర్ చేయాలా..? లేక కొత్తగా ఉత్తరాంధ్రనుంచి మొదలు పెట్టాలా అనే సందిగ్ధంలో ఉన్నారు పవన్. ఈ సందిగ్ధానికి ఈరోజు తెరపడుతుంది. పవన్ యాత్ర షెడ్యూల్ ని ఈరోజు ఖరారు చేసి ప్రకటించే అవకాశముంది.

విజయవాడకు పవన్.. వారాహి పార్ట్-3 ఎప్పట్నుంచంటే..?
X

వారాహి మూడో విడతకోసం జనసేన ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే రెండు విడతల్లో వారాహి యాత్ర పూర్తయింది. త్వరలో మూడో విడత షెడ్యూల్ విడుదలవుతుంది. దీనికోసం పవన్ కల్యాణ్ విజయవాడకు వస్తున్నారు. పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో ఆయన సమావేశం అవుతారు. మూడో విడత యాత్ర షెడ్యూల్ ని ఆయన ఖరారు చేస్తారు.

వారాహి రెండు విడతల యాత్ర ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ముగిసింది. గోదావరి జిల్లాలనుంచి వైసీపీకి విముక్తి కలిగించాలని ఆయన పిలుపునిచ్చారు. హలో ఏపీ -బైబై వైసీపీ అనే నినాదం కూడా వారాహి యాత్ర నుంచి వచ్చిందే. అదే సమయంలో వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పటికీ ఆ ఎపిసోడ్ హాట్ టాపిక్ గానే ఉంది. ఇక మూడో విడతలో కూడా అదే స్థాయిలో పవన్ విమర్శల ఘాటు ఉంటుందని తెలుస్తోంది.

ఎప్పుడు..? ఎక్కడినుంచి..?

వారాహి యాత్ర మూడో విడత గురించి అధికారికంగా ఇంకా సమాచారం బయటకు రాలేదు. ఆగస్ట్ 3 లేదా 5 నుంచి యాత్ర మొదలవుతుందని తెలుస్తోంది. అయితే పశ్చిమగోదావరి జిల్లాలో మిగిలిన నియోజకవర్గాలను కవర్ చేయాలా..? లేక కొత్తగా ఉత్తరాంధ్రనుంచి మొదలు పెట్టాలా అనే సందిగ్ధంలో ఉన్నారు పవన్. ఈ సందిగ్ధానికి ఈరోజు తెరపడుతుంది. పవన్ యాత్ర షెడ్యూల్ ని ఈరోజు ఖరారు చేసి ప్రకటించే అవకాశముంది. ఇటీవల బ్రో సినిమా విడుదలతో మరోసారి పవన్ కల్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యారు. శ్యాంబాబు పాత్రతో ఆయన మంత్రి అంబటిపై సెటైర్లు కూడా వేశారు. ఇప్పుడు వారాహితో మరోసారి ప్రజల్లోకి వస్తే పవన్ బదులు చెప్పాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. వాటన్నిటికీ ఆయన వారాహిపై నుంచే సమాధానం చెబుతారని అంటున్నారు జనసైనికులు.

First Published:  31 July 2023 6:54 AM
Next Story