వాలంటీర్లను వద్దన్నప్పుడు జనసైనికులు ఎందుకు..?
పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లే వద్దంటూ ఈసీకి ఫిర్యాదు చేసిన కూటమి నేతలు.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని జనసైనికులు సహాయం చేయాలంటున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
జనసేన నాయకులు, జన సైనికులకు నా విజ్ఞప్తి..
"పెన్షన్లు తీసుకోవాల్సిన వృద్ధులకు, దివ్యాంగులకు తోడుగా ఉండండి. పెన్షన్ ఇచ్చే కార్యాలయానికి మీ వాహనంపై జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. పెన్షన్ ఇప్పించండి. ఆ తరవాత ఇంటి దగ్గర దించి రాగలరు. సామాజిక బాధ్యతగా మీరంతా పెన్షన్లు తీసుకొనేవారికి సహాయం అందించగలరు. జనసేన శ్రేణులతోపాటు కూటమిలో భాగమైన టీడీపీ, బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరుతున్నాను." పవన్ కల్యాణ్ లేటెస్ట్ ట్వీట్ ఇది. ఈ ట్వీట్ తో పవన్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. పవన్ పై నెటిజన్లు, వైసీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
జనసేన నాయకులు, జన సైనికులకు నా విజ్ఞప్తి..
— Pawan Kalyan (@PawanKalyan) April 3, 2024
పింఛన్లు తీసుకోవాల్సిన వృద్ధులకు, దివ్యాంగులకు తోడుగా ఉండండి. పింఛన్ ఇచ్చే కార్యాలయానికి మీ వాహనంపై జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. పింఛన్ ఇప్పించండి. ఆ తరవాత ఇంటి దగ్గర దించి రాగలరు. సామాజిక బాధ్యతగా మీరంతా పింఛన్లు తీసుకొనేవారికి సహాయం…
అసలు పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లే వద్దంటూ ఈసీకి ఫిర్యాదు చేసిన కూటమి నేతలు.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని జనసైనికులు సహాయం చేయాలంటున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలంటూ నిందలు వేసిన నాయకులు.. జనసేన కార్యకర్తలు పెన్షనర్లకు తోడుగా వెళ్లాలని చెప్పడం ఎంతవరకు సమంజసం అంటున్నారు. అంటే పెన్షన్లు ఇప్పించే మిషతో.. వారికి సాయం చేస్తున్నట్టు నటించి, వారి దగ్గర తమ పార్టీలకు ప్రచారం చేయడమే కూటమి పరమావధి. అందుకే ఇలా మరో కొత్త నాటకానికి తెరతీశారు.
ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రెటరీ గారూ... వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ళ దగ్గర పింఛను అందించడానికి ఉన్న ఇబ్బంది ఏమిటి? పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ దగ్గర రెవెన్యూ ఉద్యోగులకి డ్యూటీలు వేస్తారు.. తహశీల్దార్ నంబర్స్ ఇస్తారు. మరి పింఛన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా?… pic.twitter.com/5VnX1BuWC4
— Pawan Kalyan (@PawanKalyan) April 3, 2024
ఇక ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వాలంటూ ఏపీ చీఫ్ సెక్రటరీని ఉద్దేశిస్తూ మరో ట్వీట్ వేశారు పవన్ కల్యాణ్. సామాజిక పెన్షన్లను ఇంటికే వెళ్లి ఇవ్వడంలో అభ్యంతరమేంటని ప్రశ్నించారు. తన సినిమాలు రిలీజైనప్పుడు రెవెన్యూ ఉద్యోగులకు థియేటర్ల వద్ద డ్యూటీలు వేశారని, ఇప్పుడు పెన్షన్ల పంపిణీకి సరిపడా ఉద్యోగులు లేరా అని అడిగారు. కరోనా సమయంలో మద్యం షాపుల వద్ద కూడా ప్రభుత్వ ఉద్యోగులకు డ్యూటీలు వేశారని, అదే స్ఫూర్తితో పెన్షన్లు కూడా ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయాలని కోరారు. మొత్తానికి పవన్ లాజిక్ లేని ప్రశ్నలు, సూచనలతో తన పరువు తానే తీసుకున్నారు. వాలంటీర్లను వద్దన్నది వారే, ఇప్పుడు ఇంటి దగ్గరకు పెన్షన్లు రావట్లేదని గోల పెడుతుందీ వారేనంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ డబుల్ గేమ్ ని ఎండగడుతోంది.