డైమండ్ రాణి, సన్నాసోడు, సంబరాల రాంబాబు..
ప్రతి సన్నాసి, వెధవ చేత తాను మాట అనిపించుకోవాల్సి వస్తోందని, కేవలం మనకోసం జీవించే జీవితంకాకుండా సాటిమనిషి గురించి బతకడం తనకు ఇష్టం అని అందుకే తాను అందరితో మాటలు పడుతున్నానని అన్నారు పవన్ కల్యాణ్.
రణ స్థలంలో జరిగిన యువశక్తి సభలో పవన్ కల్యాణ్ ఆవేశపూరితంగా ప్రసంగించారు. ఇటీవల ఆయనపై వచ్చిన విమర్శలకు ఘాటుగా కౌంటర్లు ఇచ్చారు. ఒక్కొక్కరిని పేరు పేరునా విమర్శించారు పవన్ కల్యాణ్. సీఎం జగన్ ని మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటూ ఎద్దేవా చేసిన పవన్.. మంత్రి రోజాపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. డైమండ్ రాణి రోజా కూడా తనను విమర్శిస్తోందన్నారు. “చివరకు రోజా కూడానా, యూటూ.. ఛీ నా బతుకు చెడ” అంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
ప్రతి సన్నాసి, వెధవ చేత తాను మాట అనిపించుకోవాల్సి వస్తోందని, కేవలం మనకోసం జీవించే జీవితంకాకుండా సాటిమనిషి గురించి బతకడం తనకు ఇష్టం అని అందుకే తాను అందరితో మాటలు పడుతున్నానని అన్నారు పవన్ కల్యాణ్. సంబరాల రాంబాబు పిచ్చి కూతలు ఆపేసి పనిచేయాలి అంటూ మరో మంత్రి అంబటి రాంబాబుపై సెటైర్లు వేశారు పవన్ కల్యాణ్. సంస్కార వంతంగా ఉంటే తనంత సంస్కార వంతుడు ఎవరూ ఉండరని, రెచ్చగొడితే ఎలా ఉంటుందో కూడా చూపిస్తానని హెచ్చరించారు. ఎవరో ఐటీ మంత్రి అట.. అలాంటి సన్నాసోడు పేరు కూడా గుర్తు పెట్టుకుంటామా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సజ్జలపై కూడా సెటైర్లు..
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా టార్గెట్ చేశారు పవన్ కల్యాణ్. సరైన రాజు లేకపోతే సగం రాజ్యం పోతుందని, సలహాదారు సజ్జలైతే సంపూర్ణంగా నాశనం అవుతుందని అన్నారు పవన్. ప్రతి జిల్లాని ఒక రాష్ర్టంగా మార్చుకొని, మీరు మీకుటుంబ సభ్యులు పాలించుకోండి అని ఎద్దేవా చేశారు. మనల్నిఎవడ్రా ఆపేది అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన పవన్, వారాహితో వస్తా.. ఎవడాపుతాడో చూస్తానంటూ ఘాటుగా ముగించారు.