జ్వరం తగ్గింది.. పవన్ వస్తున్నాడు
జ్వరం నుంచి కోలుకున్నాక పవన్ ఉత్తరాంధ్రకు వెళ్తున్నారు. ఆ తర్వాత మిగతా నియోజకవర్గాలపై ఫోకస్ పెడతారు.
జనసైనికులకు గుడ్ న్యూస్. పవన్ కల్యాణ్ కు జ్వరం తగ్గింది, ఆయన తిరిగి తన రాజకీయ పర్యటనలకు సిద్ధమయ్యారు. రేపటి వరకు రెస్ట్ తీసుకుని ఎల్లుండి(ఏప్రిల్-7) నుంచి ప్రచార యాత్రలో పాల్గొంటారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈమేరకు ఆయన రివైజ్డ్ షెడ్యూల్ ని పార్టీ అధికారికంగా విడుదల చేసింది. జ్వరం కారణంగా వారాహి విజయభేరి యాత్రకు విరామం ఇచ్చిన పవన్ పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు, విశ్రాంతి తీసుకున్నారు, ఇప్పుడు మళ్లీ జనంలోకి వస్తున్నారు.
7వ తేదీన అనకాపల్లి, 8న ఎలమంచిలిలో శ్రీ @PawanKalyan గారి సభలు#VarahiVijayaBheri#VoteForGlass pic.twitter.com/4hxeXjCOBP
— JanaSena Party (@JanaSenaParty) April 5, 2024
రివైజ్డ్ షెడ్యూల్..
ఈనెల 7న అనకాపల్లిలో బహిరంగ సభ
8వతేదీ ఎలమంచిలి నియోజకవర్గంలో సభ
9వతేదీ పిఠాపురంలో ఉగాది వేడుకలు
ఆ తర్వాత ఆయన నెల్లిమర్ల, విశాఖ దక్షిణ, పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉంది. ఆ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో ఖరారు చేస్తారని తెలుస్తోంది.
వాస్తవానికి పవన్ తెనాలి సభకు ముందు అస్వస్థతకు గురయ్యారు. నాదెండ్ల మనోహర్ తరపున ఆయన తెనాలి నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది. ఇప్పుడు జ్వరం నుంచి కోలుకున్నాక ఆయన.. ఉత్తరాంధ్రకు వెళ్తున్నారు. ఆ తర్వాత మిగతా నియోజకవర్గాలపై ఫోకస్ పెడతారు. వారాహి యాత్రను మొదలు పెట్టిన రెండు రోజులకే ఆయనకు జ్వరం రావడం, విశ్రాంతి పేరుతో ఇంటికే పరిమితం కావడంతో ట్రోలింగ్ మొదలైంది. అనకాపల్లి సభలో పవన్ రీఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి.