చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే అమలులోకి తీసుకొచ్చిన రోడ్ షోల రద్దు జీవోతో పాటు ఇతర ఆంక్షలపైనా చంద్రబాబుతో పవన్ చర్చించనున్నట్లు సమాచారం. చంద్రబాబు కుప్పం పర్యటనలో పోలీసుల ఆంక్షలు, తదితర విషయాలు కూడా నేతల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో జనసేన అధినేత వపన్ కల్యాణ్ ఆదివారం భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్ బాబుతో సమావేశమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే అమలులోకి తీసుకొచ్చిన రోడ్ షోల రద్దు జీవోతో పాటు ఇతర ఆంక్షలపైనా చంద్రబాబుతో పవన్ చర్చించనున్నట్లు సమాచారం. చంద్రబాబు కుప్పం పర్యటనలో పోలీసుల ఆంక్షలు, తదితర విషయాలు కూడా నేతల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
గతంలో పవన్ విశాఖలో పర్యటించినపుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అప్పుడు విజయవాడలో పవన్ కల్యాణ్ ఉన్న హోటల్ కు వెళ్లి జనసేనానికి చంద్రబాబు సంఘీభావం తెలిపారు. మరోవైపు, ఈ నెల 12న శ్రీకాకుళంలో జనసేన నిర్వహించతలపెట్టిన యువశక్తి సభకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబుతో పవన్ చర్చించనున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం
ఇప్పటి వరకు తెలుగుదేశం, జనసేనలు పరోక్షంగా సహకరించుకుంటున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు డైరెక్షన్ లోనే పని చేస్తున్నారని వైసీపీ ఆరోపణలు కూడా చేస్తున్నది. అయితే ప్రస్తుత ఇద్దరు నాయకుల సమావేశం తర్వాత ఏపీ రాజకీయాల్లో కీలకమార్పులు ఏమైనా వస్తాయా అనే చర్చ కూడా నడుస్తోంది.వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన మధ్య పొత్తు విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.