ప్రాణహాని వ్యాఖ్యలు.. సంచలనం కోసమేనా..?
తనవి కేవలం ఆరోపణలు కావని, పక్కా ఆధారాలున్నాయని, దానికి సంబంధించిన రికార్డ్స్ తన వద్ద ఉన్నాయని చెప్పారు పవన్ కల్యాణ్. ఇంటెలిజెన్స్ వర్గాలు తనకు రిపోర్ట్స్ కూడా పంపించాయన్నారు.
"2019లో వైసీపీ అధికారంలోకి రాకపోతే నన్ను చంపేసేవారేమో..? బ్రతికి ఉండాలంటే నాకు సెక్యూరిటీ తప్పనిసరి. ప్రత్యేక సుపారీ ఇచ్చి నా హత్యకు ప్లాన్ చేశారు. నాకు ప్రాణహాని ఉంది." కాకినాడ జనసేన నాయకుల సమావేశంలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడో 2019 ఎన్నికల సమయంలో జరిగిన వ్యవహారాన్ని ఇప్పుడెందుకు హైలెట్ చేశారు..? పవన్ పై ఎక్కడా దాడి జరిగిన ఘటనలు లేవు, కనీసం రెక్కీ నిర్వహించిన దాఖలాలు లేవు, ఎప్పుడూ పవన్, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉదాహరణలు కూడా లేవు. మరిప్పుడు సడన్ గా తనకు ప్రాణహాని ఉందని, 2019లోనే తనని చంపేసేవారని పవన్ చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి. కేవలం సంచలనం కోసమే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారని అనుకోవాలా..?
పవన్ కు ప్రాణహాని ఉందని ఆ మధ్య కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ హాని చంద్రబాబువైపు నుంచి అని అనుమానం వ్యక్తం చేశారు పాల్. పవన్ తో పొత్తు పెట్టుకుని, ఆయనకు హాని చేస్తే.. ఆ సింపతీ ఓట్లతో గెలవాలనేది చంద్రబాబు ఆలోచనగా చెప్పుకొచ్చారు పాల్. పవన్ ఇప్పుడు అవే ఆరోపణలను సమర్థించారు. అయితే ఆ హాని చంద్రబాబు వైపునుంచి కాదని, వైసీపీవైపు నుంచి అని అంటున్నారాయన. 2019లో వైసీపీ అధికారంలోకి రాకపోతే ననని చంపేద్దామనుకున్నారని చెప్పుకొచ్చారు.
ఈ ఆలస్యానికి కారణమేంటి..?
తనవి కేవలం ఆరోపణలు కావని, పక్కా ఆధారాలున్నాయని, దానికి సంబంధించిన రికార్డ్స్ తన వద్ద ఉన్నాయని చెప్పారు పవన్ కల్యాణ్. ఇంటెలిజెన్స్ వర్గాలు తనకు రిపోర్ట్స్ కూడా పంపించాయన్నారు. తన వల్ల ఇబ్బంది ఉన్నవాళ్లు తనని బతకనిస్తారా అని ప్రశ్నిస్తున్నారు పవన్. పోనీ అదే నిజమైతే ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడెందుకు ఆ వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. సింపతీ కోసమే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు.