టీడీపీకి పవన్ షాకిచ్చారా? సీఎం పదవి కావాలట..
రేపటి ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేయబోయే అభ్యర్థులందరికీ కామన్‌గా గాజు గ్లాసు సింబల్ దక్కుతుందో లేదో కూడా తెలియదు. ఇలాంటి పార్టీ భవిష్యత్తులో వైసీపీకి ప్రధాన ప్రత్యర్థి అవబోతుందని ఎలా అనుకుంటున్నారో తెలియడం లేదు.
కత్తిపూడి బహిరంగసభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక కీలకమైన వ్యాఖ్యచేశారు. అదేమిటంటే భవిష్యత్తులో వైసీపీకి జనసేన మాత్రమే ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుందట. వైసీపీకి జనసేన ప్రధాన ప్రత్యర్థిగా మారబోతోందని పవన్ ఎలాగ అనుకున్నారో అర్థంకావటంలేదు. జనసేనకు ఉన్నది కేవలం జెండా మాత్రమే. ఒక అజెండా లేదు, ఎన్నికల్లో పాల్గొనే విషయంలో సొంతంగా మ్యానిఫెస్టో లేదు. ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందో తెలియదు.
రాజకీయ పార్టీకి ఎంతో కీలకమైన ఎలక్షన్ సింబలే లేదు. రేపటి ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేయబోయే అభ్యర్థులందరికీ కామన్‌గా గాజు గ్లాసు సింబల్ దక్కుతుందో లేదో కూడా తెలియదు. ఇలాంటి పార్టీ భవిష్యత్తులో వైసీపీకి ప్రధాన ప్రత్యర్థి అవబోతుందని ఎలా అనుకుంటున్నారో తెలియడం లేదు. సరే కాసేపు పవన్ వ్యాఖ్యను పక్కనపెట్టేస్తే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పరిస్థితి ఏమిటి? ఇప్పుడు వైసీపీకి ప్రధాన ప్రత్యర్థి టీడీపీనే అన్న విషయం అందరికీ తెలిసిందే.
నాలుగు దశాబ్దాల వయసున్న టీడీపీని కాదని జనసేన ఎలా ప్రధాన ప్రత్యర్థి అవుతుంది? నేతలు, క్యాడర్ పరంగా చూస్తే టీడీపీ చాలా పటిష్టమైన స్థితిలో ఉంది. టీడీపీతో పోల్చితే జనసేన ఎందుకు పనికిరాదనే చెప్పాలి. ఈ విషయంలో ఎవరికీ అనుమానం అవసరమే లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వైసీపీ దెబ్బకు భయపడే టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకుంటున్నారు. ఒంటరిగా పోటీచేస్తే జనసేనకు రెండోసారి కూడా వీరమరణం తప్పదని స్వయంగా పవనే బహిరంగసభల్లో చెప్పుకున్నారు.
ఒకవైపు పవన్ భయపడుతూనే.. భవిష్యత్తులో వైసీపీకి జనసేన ప్రధాన ప్రత్యర్థి అవుతుందంటే మరి టీడీపీ ఏమవుతుందనే అనుమానాలు పెరుగుతున్నాయి. అంటే భవిష్యత్తులో టీడీపీ ఉండదని పవన్ ఉద్దేశమా? టీడీపీ ఉండక ఏమవుతుంది? 2024 ఎన్నికల్లో కూడా వైసీపీనే గెలిస్తే టీడీపీ ఉంటుందో ఉండదో తెలియదు కానీ జనసేన ఉంటుందనే నమ్మకం మాత్రం చాలామందిలో లేదు. ఎందుకంటే ఇప్పటికే పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేస్తున్న పవన్ తన పూర్తి సమయాన్ని సినిమాలకే కేటాయిస్తారన్న విషయంలో అనుమానంలేదు. పైగా ముఖ్యమంత్రి పదవిని ఇస్తే సంతోషంగా తీసుకుంటానని చెప్పారు. ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారో కూడా తెలియని పవన్‌కు సీఎం పదవి ఎలా వస్తుంది? ఎవరిస్తారు?