భారీగా పెరిగిన పవన్‌కల్యాణ్ ఆస్తులు.. క్రిమినల్ కేసులు ఎన్నంటే..?
పవన్‌కల్యాణ్‌పై 8 క్రిమినల్ కేసులు ఉండగా.. ఇందులో ఎక్కువ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకు పెట్టినవే. ఇక పవన్ తన విద్యార్హతలను సైతం అఫిడవిట్‌లో వెల్లడించారు.
జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ ఆస్తులు గడిచిన ఐదేళ్లలో 191 శాతం పెరిగాయి. 2019 ఎన్నికల టైమ్‌లో పవన్ ఆస్తులు రూ. 56 కోట్లుగా ఉండగా.. తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం రూ.163 కోట్లకు పెరిగాయి. ఈ ఆస్తులు మొత్తం తనతో పాటు తన భార్య, మరో నలుగురు పిల్లల పేరిట ఉన్నట్లు పేర్కొన్నాడు పవన్.
పిఠాపురం జనసేన అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు పవన్‌కల్యాణ్. 2018-19 మధ్య రూ.కోటి నష్ట పోయానని అఫిడవిట్‌లో పేర్కొన్న పవన్.. 2022-23 మధ్య 12.2 కోట్లు ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.
పవన్‌కల్యాణ్ చరాస్తుల విలువ రూ.46 కోట్లుగా ఉంది. ఇందులో డిపాజిట్లతో పాటు 14 కోట్ల విలువైన కార్లు, బైకులు ఉన్నాయి. పవన్ పేరిట హర్లి డేవిడ్‌సన్ బైక్, బెంజ్‌తో పాటు రూ.5.4 కోట్ల విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్, రూ.2.3 కోట్ల విలువైన టయోటా క్రూజర్ ఉన్నాయి. ఇక పవన్ ఫ్యామిలీకి రూ.118 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. హైదరాబాద్ సమీపంలోని జన్వాడతో పాటు జూబ్లిహిల్స్, మంగళగిరిలో భూములు, బిల్డింగ్స్ ఉన్నాయి. తనకు రూ. 65 కోట్ల అప్పులు ఉన్నాయని అఫిడవిట్‌లో స్పష్టం చేశారు జనసేనాని
పవన్‌కల్యాణ్‌పై 8 క్రిమినల్ కేసులు ఉండగా.. ఇందులో ఎక్కువ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకు పెట్టినవే. ఇక పవన్ తన విద్యార్హతలను సైతం అఫిడవిట్‌లో వెల్లడించారు. నెల్లూరులోని స్కూల్ నుంచి పదో తరగతి పాస్ అయినట్లు స్పష్టం చేశారు.