ఆ పదవి కావాలి.. పవన్ మనసులో మాట!
ఏపీలో కూటమి ప్రభుత్వంలో జనసేనకు ఎన్ని మంత్రి పదవులిస్తారనే దానిపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు. పవన్‌కల్యాణ్ కోరుకున్నట్లుగా డిప్యూటీ సీఎం పదవి ఉంటుందా, లేదా అనే దానిపైనా స్పష్టత రావాల్సి ఉంది.

ఏపీలో ఏర్పడే కూటమి ప్రభుత్వంలో జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ ఏ పదవి తీసుకుంటారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే తాజాగా ఆయన మనసులో మాట బయటపెట్టారు. ప్రధాని మోడీ ప్రమాణస్వీకారానికి సతీసమేతంగా హాజరైన పవన్‌కల్యాణ్.. అక్కడ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ తాను కోరుకుంటున్న పదవిపై క్లారిటీ ఇచ్చారు.
ఏపీలో కూటమి ప్రభుత్వంలో చేరతామని చెప్పిన పవన్‌కల్యాణ్.. ఉప ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తి ఉన్నట్లు స్పష్టం చేశారు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వంలో జనసేనకు ఎన్ని మంత్రి పదవులిస్తారనే దానిపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు. పవన్‌కల్యాణ్ కోరుకున్నట్లుగా డిప్యూటీ సీఎం పదవి ఉంటుందా, లేదా అనే దానిపైనా స్పష్టత రావాల్సి ఉంది. పవన్‌కల్యాణ్ ప్రాధాన్యత పెంచేలా పదవులు ఉంటాయా.. బాబు అవకాశం కల్పిస్తారా అనేది అనుమానమే.
ఇటీవలి ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీలతో కలిసి పోటీ చేసిన జనసేన.. 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది. కేంద్రమంత్రి వర్గంలో మాత్రం జనసేనకు చోటు దక్కలేదు. కేంద్రంలో టీడీపీకి ఒక కేబినెట్ బెర్త్‌తో పాటు ఒక సహాయ మంత్రి పదవి ఇచ్చారు. బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు కేబినెట్‌లో స్థానం లభించింది.