Telugu Global
Andhra Pradesh

మీ ప్రాణానికి నా ప్రాణం.. రాజంపేటలో పవన్ కామెడీ

కోస్తాలో తాను వైసీపీని నిలువరించేస్తున్నారట, సమూలంగా తుడిచిపెట్టేస్తున్నారట, రాయలసీమలో కూడా వైసీపీని తొక్కిపడేయండి అంటూ రాజంపేట ఓటర్లకు ఉపదేశమిచ్చారు పవన్.

మీ ప్రాణానికి నా ప్రాణం.. రాజంపేటలో పవన్ కామెడీ
X

ప్రచార సభల్లో పవన్ కల్యాణ్ పంచ్ డైలాగులు పేలుస్తున్నారు. అలాంటివి కేవలం సినిమాల్లోనే వినడానికి బాగుంటాయి. కానీ పవన్ మాత్రం ఓటర్ల ముందుకెళ్లి వాళ్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో కూటమిని మరీ అతిగా ఊహించేసుకుంటున్నారు. వైసీపీ పరాజయం ఖాయమైపోయినట్టు మాట్లాడుతున్నారు. రాజంపేటలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా ప్రచారానికి వచ్చిన పవన్ మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తానంటూ ఓటర్లకు భరోసా ఇచ్చారు.


అసలు ఎన్నికల్లో ప్రాణాలకు ప్రాణం అడ్డేయడం అనే ప్రస్తావన ఉంటుందా..? ఎక్కడో పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ తీరిక చూసుకుని ఓ సాయంత్రం బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి కోసం రాజంపేట వచ్చి ఇక్కడి ఓటర్లకు ధైర్యం చెప్పడం మరీ విచిత్రంగా ఉంది. ఇదేదో యుద్ధమైనట్టు, ఈ యుద్ధంలో ఓటర్లు ప్రాణాలు కోల్పోతున్నట్టు, వారికి తన ప్రాణం అడ్డేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు పవన్.

కోస్తా అంతటా ఒక్క సీటు కూడా రాకుండా వైసీపీని నిలువరిస్తానంటూ పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు పవన్. కోస్తాలో తాను వైసీపీని నిలువరించేస్తున్నారట, సమూలంగా తుడిచిపెట్టేస్తున్నారట, రాయలసీమలో కూడా వైసీపీని తొక్కిపడేయండి అంటూ రాజంపేట ఓటర్లకు ఉపదేశమిచ్చారు పవన్. ఎన్డీఏ కూటమి కచ్చితంగా అధికారంలోకి వస్తుందని అన్నారాయన. పిఠాపురంకు వచ్చి తనని ఓడించేందుకు మిథున్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, ఆయన్ను రాజంపేటలో ఓడించాలని పిలుపునిచ్చారు పవన్.

First Published:  25 April 2024 9:33 PM IST
Next Story