సిద్దాంతపరమైన పోరాటం చేస్తా....చెప్పుతో కొడతా...గొంతు పిసికి చంపుతా...తోలుతీస్తా...
మంగళగిరిలో ఈ రోజు జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో ఆ పార్టి అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్సార్ సీపీ పై విరుచుకపడ్డారు. సన్నాసులారా... ఒక్కొక్క వైసీపీ నా కొడుకులను చెప్పుతీసుకొని కొడతా. దద్దమ్మల్లారా, ఎదవల్లారా ..అంటూ మాట్లాడారు.

''నన్ను ప్యాకేజ్ స్టార్ అనే సన్నాసుల్లా రా... ఒక్కొక్క వైసీపీ నా కొడుకును చెప్పుతీసుకొని కొడతా. దద్దమ్మల్లారా, ఎదవల్లారా ఇంత కాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం రా. మీదగ్గర క్రిమినల్స్ ఉన్నారా ? గూండాలు ఉన్నారా ? ఒంటి చేత్తో మెడ పిసికి చంపుతా. ఒక్కరిని పెళ్ళి చేసుకొని 30 మందితో తిరిగే సన్నాసులు నా మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నారు. చొక్కా పట్టుకొని ఇళ్ళలోంచి బైటికి లాక్కొచ్చి కొడతా.'' ఇదీ ఈ రోజు పవన్ కళ్యాణ్ మంగళగిరిలో జరిగిన జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మాటలు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఆయన ఉపన్యాసం మొత్తం వైసీపీ నాయకుల మీద దాడిగా కొనసాగింది.
''బాలినేని శ్రీనివాస్ రెడ్డి, రాంనారాయణ రెడ్డి లాంటి సభ్యతగా మాట్లాడే వాళ్ళను వదిలేసి మిగతా వెదవల్లారా...ఇక యుద్దం మొదలైంది ఈ రోజు నుంచి నేను దేనికైనా రెడీ, రాడ్లా, హాకీ స్టిక్కులా, ఉట్టి చేతులా నేను దేనికైనా రెడీ'' అని ఆవేశంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి ఇక యుద్దమే... మీరు రెడీనా'' అని జనసేన కార్యకర్తలను ప్రశ్నించారు పవన్ .
తన ఉపన్యాసమంతా ఇంత దారుణమైన భాషను వాడిన పవన్ కళ్యాణ్ అలా మాట్లాడటాన్ని సమర్దించుకున్నారు. వైసీపీ వాళ్ళకు ధీటుగా తాను కూడా ఇలాంటి భాషను మాట్లాడగలనని చెప్పారు. అంతే కాక ఎప్పుడు చెప్పినట్టే తాను కానిస్టేబుల్ కొడుకునని, వీధి బడిలో చదువుకున్నానని, మంగళగిరి, ఒంగోలు వీధుల్లో తిరిగానని, తనకు ఆ భాషే తెలుసునని చెప్పారు. ఇంత కాలం మర్యాద ఇచ్చానని కానీ వాళ్ళు దాన్ని నిలబెట్టుకోవడం లేదంటూ ద్వజమెత్తారు.
పవన్ కళ్యాణ్ ఉపన్యాసమంతా తిట్లు... శాపనార్ధాలు... హెచ్చరికలు... సవాల్ లు... రెచ్చగొట్టడాలు అయిన తర్వాత తన పోరాటం సిద్దాంతపరమైనదని, వైసీపీ పోరాటం రౌడియిజంతో కూడుకున్నదని ప్రకటించారు.