Telugu Global
Andhra Pradesh

ప్రభుత్వాన్ని పవన్, లోకేష్ రెచ్చగొడుతున్నారా?

ప్రభుత్వం రెచ్చిపోయి యాత్రలను అడ్డుకుంటే గొడవలు చేసి ప్రచారం తెచ్చుకోవాలని వీళ్ళ ప్రయత్నంలాగుంది. కానీ ప్రభుత్వం ఏమో వీళ్ళ వార్నింగులను పట్టించుకోవటంలేదు.

ప్రభుత్వాన్ని పవన్, లోకేష్ రెచ్చగొడుతున్నారా?
X

జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తరచూ ఒక మాట అంటున్నారు. ప్రభుత్వాన్ని పదేపదే బెదిరిస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే గన్నవరం బహిరంగసభలో లోకేష్ మాట్లాడుతూ.. సాగనిస్తే పాదయాత్ర..అడ్డుకుంటే దండయాత్ర.. భయం నా బ్లడ్‌లోనే లేదు అని పదేపదే ప్రభుత్వానికి వార్నింగులిచ్చారు. అసలు పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుంది? కుప్పంలో మొదలైన పాదయాత్ర గన్నవరం చేరుకునేంతవరకు ఎక్కడైనా పాదయాత్రను అడ్డుకుందా?

ముందుగా ఇచ్చిన రూటు మ్యాప్‌లో పాదయాత్ర సాగుతున్నప్పుడు ప్రభుత్వం ఏ రూపంలో కూడా అడ్డుకోలేదు. ఇక ముందు కూడా అడ్డుకునే అవకాశంలేదు. ఎందుకంటే లోకేష్ పాదయాత్రతో తమకేదో నష్టం జరిగిపోతుందని ప్రభుత్వం అనుకోవటంలేదు. పైగా పాదయాత్ర చేయటం లోకేష్ హక్కు కూడా. ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న పాదయాత్రను అడ్డుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంటుంది ? పాదయాత్రను అడ్డుకోండి చూస్తాం అని లోకేష్ పదేపదే సవాలు విసురుతున్నారు.

ఎందుకంటే ప్రభుత్వం పాదయాత్రను అడ్డుకోవాలని, అప్పుడు గొడవలు జరగాలని, అది మీడియాలో బాగా హైలైట్ అయి తనకు మైలేజీ రావాలని లోకేష్ బలంగా కోరుకుంటున్నట్లున్నారు. మొన్న చంద్రబాబునాయుడు పుంగనూరు పర్యటనలో గొడవలు అయినట్లుగా. లోకేష్ ఆలోచనను అర్థంచేసుకున్న ప్రభుత్వం కూడా పాదయాత్రను అసలు పట్టించుకోవటమే లేదు. ఇక పవన్ కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. తన వారాహి యాత్రను అడ్డుకోండి చూద్దాం అంటు పదేపదే వార్నింగులిస్తున్నారు. వారాహి యాత్రను అడ్డుకుంటే ప్రళయం సృష్టిస్తానని, మంటలు మండిస్తానని పవన్ ఎందుకు ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారో అర్థంకావటంలేదు.

పాదయాత్రను అయినా వారాహి యాత్రను అయినా అడ్డుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. వీళ్ళ యాత్రలు సజావుగా సాగిపోతే మామూలు జనాలు పెద్దగా పట్టించుకోవటంలేదు. అందుకనే జనాల్లో గుర్తింపు వచ్చేందుకు ప్రభుత్వాన్ని చాలెంజ్‌లు చేస్తు పదేపదే రెచ్చగొడుతున్నారు. ప్రభుత్వం రెచ్చిపోయి యాత్రలను అడ్డుకుంటే గొడవలు చేసి ప్రచారం తెచ్చుకోవాలని వీళ్ళ ప్రయత్నంలాగుంది. కానీ ప్రభుత్వం ఏమో వీళ్ళ వార్నింగులను పట్టించుకోవటంలేదు. అందుకనే ఇద్దరూ కూడా ప్రభుత్వాన్ని పదేపదే రెచ్చగొడుతున్నారు. మరి వీళ్ళ కోరికను ప్రభుత్వం ఎప్పుడు తీరుస్తుందో చూడాలి.


First Published:  23 Aug 2023 11:14 AM IST
Next Story