ప్రభాస్, మహేష్ నాకంటే పెద్ద హీరోలు -పవన్
ప్రభాస్, మహేష్ పాన్ ఇండియా హీరోలని, వారికి తనకంటే ఎక్కువ పారితోషికం ఉంటుందని చెప్పారు పవన్. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్స్ గా ఎదిగారన్నారు. వారు ప్రపంచానికి తెలిసినంతగా తాను తెలియకపోవచ్చని చెప్పారు.
పవన్ ఆవేశం కాస్త చల్లారింది. వరుస మీటింగ్ లలో వైసీపీ నేతలపై దుమ్మెత్తిపోసిన పవన్, తొడగొట్టి సవాళ్లు విసిరిన పవన్, ముమ్మిడివరం సభలో మాత్రం స్పీడ్ తగ్గించారు. ఎమ్మెల్యే ద్వారంపూడిపై మళ్లీ విమర్శలు చేసినా, ఈసారి డోస్ బాగా తగ్గిపోయింది. పైగా హీరోలు, అభిమానులు, అభిమానుల మధ్య గొడవలు అంటూ కొత్త సబ్జెక్ట్ తీసుకున్నారు పవన్.
ప్రభాస్, మహేష్ తో పోలిక..
సమకాలీన హీరోలెవరూ ఒకరితో ఒకరు పోలిక పెట్టుకోరు. కానీ, పవన్ కల్యాణ్ ఎందుకో ప్రభాస్, మహేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్ అంటూ కొత్త పోలిక తెచ్చారు. ప్రభాస్, మహేష్ పాన్ ఇండియా హీరోలని, వారికి తనకంటే ఎక్కువ పారితోషికం ఉంటుందని చెప్పారు. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్స్ గా ఎదిగారన్నారు. వారు ప్రపంచానికి తెలిసినంతగా తాను తెలియకపోవచ్చని చెప్పారు.
#VarahiVijayaYatra - ముమ్మిడివరం :
— JanaSena Party (@JanaSenaParty) June 21, 2023
ఎన్టీఆర్ గారి అభిమానులు, మీ అభిమానులు గొడవ పడుతున్నారు అని చెప్తున్నారు..
సినిమా అనేది వినోదం, ఆనందం.
నాకు ఎన్టీఆర్ గారు అన్నా, అల్లు అర్జున్ గారు అన్నా, ప్రభాస్ గారు అన్నా, మహేష్ బాబు గారు అన్నా, రామ్ చరణ్ గారు అన్నా, మెగాస్టార్ చిరంజీవి… pic.twitter.com/odBg9L60Ro
అందరి అభిమానులు నాకు ఓట్లేయండి..
ఫైనల్ గా పవన్ చెప్పొచ్చింది ఏంటంటే.. హీరోగా మీరు ఎవరినైనా ఆరాధించండి, కానీ నాకే మీ ఓట్లు వేయండి అని. ఆమధ్య వైసీపీ నేతలు కూడా ఇలాగే ప్రచారం చేసేవారు. హీరోగా పవన్ ని ఆరాధించండి, ఓటు మాత్రం వైసీపీకి వేయండి అని చెప్పేవారు. పవన్ కూడా ఇప్పుడు అందరు హీరోల అభిమానులు తనకే ఓట్లు వేయాలని చెబుతున్నారు. సినిమాల పరంగా హీరోల మీద ఇష్టాన్ని రాజకీయాల్లో చూపించకండి అన్నారు. సినిమాల విషయంలో ఎవరినైనా అభిమానించండి కానీ రాజకీయం విషయంలో సమష్టిగా ఆలోచిద్దామని పిలుపునిచ్చారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, అల్లు అర్జున్.. ఇలా ప్రతి ఒక్కరిపై తనకు గౌరవం ఉందని, వారి సినిమాలు కూడా తాను చూస్తానని, కనిపిస్తే కలసి మాట్లాడుకుంటామన్నారు పవన్.