ఎవరో నా చెప్పులు కొట్టేశారు.. పవన్ పంచ్ లు
అన్నవరం గుడికి వెళ్తే తన చెప్పులెవరో కొట్టేశారంటూ సెటైర్లు పేల్చారు పవన్. తనకెంతో ఇష్టమైన తన రెండు చెప్పులు ఎవరో కొట్టేశారని, వారు కనపడితే పట్టుకోవాలన్నారు.

పిఠాపురం సభలో పవన్ కల్యాణ్ పంచ్ లు విసిరారు. తాను ఒక చెప్పు చూపిస్తే దానికి బదులుగా మాజీ మంత్రి పేర్ని నాని రెండు చెప్పులు చూపించడంతో పవన్ బాగా హర్ట్ అయినట్టున్నారు. అందుకే పేర్ని నాని పేరెత్తకుండానే పంచ్ లు విసిరారు. పిఠాపురం సభకు ఫ్యాంట్, హాఫ్ హ్యాండ్స్ షర్ట్ లో వచ్చిన పవన్ తన ఆహార్యం మారిన విషయాన్ని గుర్తు చేశారు. తాను జుబ్బా వేసుకు రావాలనుకున్నాను కానీ తనకి చెప్పులు లేవని అందుకే ఫ్యాంట్, షర్ట్, షూస్ వేసుకొచ్చానని చెప్పారు.
అన్నవరం గుడికి వెళ్తే తన చెప్పులెవరో కొట్టేశారంటూ సెటైర్లు పేల్చారు పవన్. తనకెంతో ఇష్టమైన తన రెండు చెప్పులు ఎవరో కొట్టేశారని, వారు కనపడితే పట్టుకోవాలని, తన రెండు చెప్పులు తనకు ఇప్పించాలన్నారు. ప్రెస్ మీట్లో పేర్ని నాని రెండు చెప్పులు చూపించి పవన్ కి కౌంటర్ ఇవ్వగా, ఆ రెండు చెప్పులు ఆయన గుడిలోనుంచి కొట్టుకెళ్లినట్టుగా చిన్న స్టోరీ చెప్పి జనసేనాని బదులు తీర్చుకున్నారు.
నా రెండు చెప్పులు కొట్టేశారు, ఎవరో దొంగిలించారు. మీకు కనిపిస్తే పట్టుకోండి, నా చెప్పులు నాకు ఇప్పిచండి ప్లీజ్. వైసీపీ ప్రభుత్వం గుడిలో నా చెప్పులు కూడా పట్టుకుని వెళ్లిపోతుంది. - JanaSena Chief Sri @PawanKalyan #VarahiVijayaYatra pic.twitter.com/aQ24qpOokC
— JanaSena Party (@JanaSenaParty) June 16, 2023
సన్నాసులు, దరిద్రులు, గూండాగాళ్లు..
పిఠాపురం సభలో వారాహి వాహనంపై ఉన్న పవన్ ఊగిపోతూ తన పాత స్టైల్ లో ప్రసంగించారు. సన్నాసులు, దరిద్రులు, రౌడీగాళ్లతో పాలింపబడటానికి మనకి సిగ్గుండాలంటూ ప్రజల్ని ఉద్దేశించి అన్నారు. వేలమంది జనం ఉన్నా నలుగురు రౌడీలు వారందర్నీ తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటారని, ప్రజలు వారి బలం వారు తెలుసుకోనంతకాలం ఇదే జరుగుతుందని చెప్పారు. మేథావుల్లాగా బిల్డప్ ఇవ్వడం వైసీపీ నేతలకు అలవాటైందని చెప్పారు. వైసీపీ గూండాలందర్నీ నడిరోడ్డుపై బట్టలూడదీసి కొట్టిస్తానంటూ ఆవేశంగా మాట్లాడారు పవన్ కల్యాణ్. శ్రీపాద శ్రీ వల్లభుడి సాక్షిగా తానీమాట చెబుతున్నానని అన్నారు.