Telugu Global
Andhra Pradesh

పదేళ్లుగా సీఎం సీఎం అని అరుస్తున్నారు.. ఏం లాభం..?

పదేళ్లుగా సీఎం సీఎం అని అరుస్తూనే ఉన్నారంటూ అభిమానులపై కసురుకున్నారు పవన్ కల్యాణ్.

పదేళ్లుగా సీఎం సీఎం అని అరుస్తున్నారు.. ఏం లాభం..?
X

175కి 21 స్థానాల్లో పోటీ చేసిన ఏ పార్టీ.. ముఖ్యమంత్రి అభ్యర్థిని డిసైడ్ చేయలేదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ పవన్ కల్యాణ్ అభిమానులు మాత్రం సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. గతంలో కూడా ఇలాంటి నినాదాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పవన్, ఈసారి కూడా అలానే ఫ్రస్టేట్ అయ్యారు. మీరు పదేళ్లుగా సీఎం సీఎం అని అరుస్తూనే ఉన్నారంటూ కసురుకున్నారు. తన ముందున్న తక్షణ కర్తవ్యం జనసేనకు రాజకీయ పార్టీగా గుర్తింపు తేవడమేనని తేల్చి చెప్పారు.

యలమంచిలిలో నిర్వహించిన వారాహి విజయ యాత్రలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్ద కాలంగా మీరు సీఎం సీఎం అని అరుస్తున్నారు కానీ తాను సీఎం అవుతానో లేదో కాలమే నిర్ణయించాలన్నారు. సీఎం అవుతానో లేదో కానీ.. తాను మాత్రం ప్రజలకోసం ఓ కూలీలాగా కష్టపడతానని చెప్పుకొచ్చారు. జనసేనకు గుర్తింపు తీసుకు రావడమే తన తొలి బాధ్యత అన్నారు.

గుర్తుతో కష్టాలు..

పదేళ్లుగా పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఉన్నా కూడా జనసేనకు ఎన్నికల కమిషన్ వద్ద గుర్తింపు లేదు. అందుకే గాజు గ్లాసు గుర్తుని ఆ పార్టీకి కేటాయించట్లేదు. అది ఫ్రీ సింబల్ గానే ఉంది. పొత్తులో ఉన్నాం, కూటమిలాగా ఏపీలో అన్ని స్థానాలకు పోటీ చేస్తున్నామని బతిమిలాడుకుంటే ఈసీ కాస్త మినహాయింపునిచ్చింది. జనసేన పోటీ చేస్తున్న అసెంబ్లీ, లోక్ సభ స్థానాల పరిధిలోకి వచ్చే ఇతర నియోజకవర్గాల్లో మాత్రం స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తుని కేటాయించట్లేదని చెప్పింది. మిగతా చోట్ల స్వతంత్రులు గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేస్తారు. ఈ ట్విస్ట్ ఇప్పుడు కూటమికి నిద్రలేకుండా చేస్తోంది.

First Published:  2 May 2024 7:09 AM IST
Next Story